స్టార్ హీరోల దగ్గర కూడా లేని కారు కొన్న క్రేజీ బ్యూటీ.. రోల్స్ రాయిస్ కల్లినన్ ఉన్న ఫస్ట్ హీరోయిన్
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సౌత్ సినిమాపై దృష్టి సారించింది. ముఖ్యంగా కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర భాష నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లో చిన్న ఛాన్స్ వచ్చినా నటించేందుకు సిద్ధమంటున్నారు పలువురు హీరోయిన్స్.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్నాయి దర్శకులు, హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక హీరోలు కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ఏకంగా ఇండియాలోనే కాస్ట్లీ కారు కొని అందరిని షాక్ కు గురి చేసింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోల దగ్గర కూడా లేని ఖరీదైన కారును ఈ అమ్మడు సొంతం చేసుకుంది.
ఇండియాలో రూ.12 కోట్ల కారు కొన్న ఫస్ట్ హీరోయిన్ గా నిలిచింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు ప్రేక్షకులకు ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్. తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఇటీవలే బాలయ్యతో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించింది. అలాగే ఈ సినిమాలో ఊర్వశి చేసిన దబిడి దబిడి సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది.
అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఊర్వశి. అలాగే విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 7 కోట్ల 30లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఊర్వశి ఏకంగా రూ.12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ SUVని కొనుగోలు చేసింది. ఈ కాస్ట్లీ కారు అందరి దగ్గర ఉండదు. రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కొన్న ఫస్ట్ ఇండియన్ హీరోయిన్‌గా ఆమె హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖేష్ అంబానీ, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, భూషణ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి ఇండియన్ సెలబ్రిటీలు దగ్గర ఈ కారు ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..