ఇద్దరు బడా హీరోలు, ఒక స్టార్ హీరోయిన్.. థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్ మూవీ..
కొన్ని సినిమాలు థియేటర్స్ లో భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కినా కూడా అవి డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను సాధిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా థియేటర్స్ లో డబుల్ డిజాస్టర్ అయ్యింది.

ఓటీటీలు అందుబాటిలోకి వచ్చిన తర్వాత థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ సినిమాలు చూస్తూ ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి సినిమాలు. ఒకటికి రెండు సార్లు ఓటీటీలో తమ అభిమాన సినిమా చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్‌లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీల్లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి.. ఓటీటీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఏండ్ల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కూడా ఓటీటీలో అదరగొడుతుంది. మూడేళ్ళుగా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది.
ఇది కూడా చదవండి : ఆమె నా సినిమాలో చేయకపోవడమే మంచిదైంది.. స్టార్ హీరోయిన్ పై రాజమౌళి
180కోట్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా.. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022లో రిలీజైంది. ఈ సినిమాలో నటించిన వారందరూ పెద్ద స్టారే.. ఈ సినిమాలో సంజయ్ దత్, కరీనా కపూర్‌లాంటి స్టార్స్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా నటించారు.
ఇది కూడా చదవండి : రెండే రెండు సినిమాలు హిట్. మిగిలినవన్నీ ఫ్లాప్.. దెబ్బకు మాయం అయ్యింది
ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్ స్టోరీతో డైరెక్టర్ అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారె నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్స్‌లో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆమిర్ ఖాన్, నాగచైతన్య యాక్టింగ్‌కి మంచి మార్కులే పడినా ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ అల్ గా రూ. 120కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దాదాపు మూడేళ్ళుగా లాల్ సింగ్ చద్దా సినిమా ట్రెండింగ్ లో ఉంది.
ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! పెట్టింది రూ. 16 కోట్లు.. వచ్చింది రూ.400కోట్లు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




