AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suma Kanakala: ఏంటి.. యాంకర్ సుమ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిందా..!! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

బుల్లితెరపై టాప్ యాంకర్ సుమ కనకాల. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న యాంకర్. ఓవైపు రియాల్టీ షోస్.. మరోవైపు మూవీ ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఇన్ స్టాలో చురుకుగా ఉండడం.. అటు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ రన్ చేస్తూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది.

Suma Kanakala: ఏంటి.. యాంకర్ సుమ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిందా..!! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
Suma
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2025 | 7:27 PM

Share

బుల్లితెర పై తిరుగులేకుండా రాణిస్తున్నారు సుమ కనకాల. తనదైన యాంకరింగ్ తో ఎన్నో టీవీషోలను విజయవంతంగా నడిపిస్తున్నారు సుమ. మాతృబాష తెలుగు కాకపోయినప్పటికీ అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు సుమ. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత యాంకరింగ్ లో దూసుకుపోతున్నారు. సుమ కెరీర్ బినింగ్ లో పలు సీరియల్స్ లో నటించారు. వేయిపడగలు అనే సీరియల్ తో పరిచయం అయ్యారు సుమ. ఈ సీరియల్ లో లీడ్ రోల్ లో కనిపించారు సుమ. ఆతర్వాత మేఘమాల సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ కానుకలతో ప్రేమలో పడ్డారు.

2006లో ‘అవాక్కయ్యారా…’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్‌ కెరీర్ మొదలు పెట్టరు సుమ. అంతకు ముందు సినిమాల్లోనూనటించారు సుమ నటించిన తొలి సినిమా ఎదో తెలుసా..? సుమ హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తు. దాసరి నారా యణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా నటించారు సుమ. ఆ తర్వాత మలయాళంలో కూడా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు సుమ.

అయితే యాంకరింగ్ లోకి వచ్చిన తర్వాత సినిమాల పైన అంత మక్కువ చూపలేదు సుమ. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆమె ఎక్కువగా యాంకరింగ్ పైనే దృష్టి పెట్టారు. మొన్నామధ్య జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించారు సుమ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం సుమ యాంకర్ గా రాణిస్తున్నారు. ఆమె కుమారుడు రోషన్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య బబుల్‌గమ్ సినిమా చేశారు. ఇక ఇప్పుడు మోగ్లీ అనే సినిమాతో రాబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?