AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: పవన్ పై రేణు ప్రశంసల వర్షం.. పిల్లలతో తండ్రి బంధం బలమైనది.. అంటూ కితాబు..

రేణు దేశాయ్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేని వ్యక్తి. మోడలింగ్ రంగం నుంచి నటిగా వెండి తెరపై అడుగు పెట్టి.. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుంది. అకిరా, ఆద్యలు జన్మించిన అనంతరం వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. తర్వాత అకిరా, ఆధ్యలతో పూణేలో నివసిస్తోంది. బాధ్యతగా యుతమైన తల్లిగా పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దుతోంది. అంతేకాదు అకిరా ఆద్యలు వీలైనప్పుడల్లా తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి సందడి చేస్తూనే ఉంటారు. తాజాగా తండ్రి పిల్లల అనుబంధం గురించి రేణు దేశాయ్ పలు విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు.

Renu Desai: పవన్ పై రేణు ప్రశంసల వర్షం.. పిల్లలతో తండ్రి బంధం బలమైనది.. అంటూ కితాబు..
Pawan Akira
Surya Kala
|

Updated on: Apr 10, 2025 | 5:56 PM

Share

రేణు దేశాయ్ తెలుగునేలను విడిచి పెట్టినా తెలుగింటితో ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని విడిచి పెట్టలేదు. తన ప్రేమని అభిమాన్ని తరచుగా ప్రకటిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ ధర్మం గురించి పలు సమస్యల గురించి ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనయుడు అకిరా నందన్, పవన్ కళ్యాణ్ తో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళిన విషయం గురించి మాట్లాడింది.

పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారాణసికి అకిరా, ఆద్యతో కలిసి రేణు దేశాయ్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అకిరాకు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరిగింది. ఆలయాలను సందర్శిచాడంపై ఇష్టం పెరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్తున్నారు అని తనతో అకిరా చెప్పాడు. అప్పుడు నువ్వు కూడా నాన్నతో కలిసి వెళ్ళు.. అక్కడ నీ ప్రయాణం ఈజీగా ఉంటుందని చెప్పను. కావాలంటే మళ్ళీ మనం అందరం కుంభమేళాకు వెళ్దాం అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది రేణు. అంతేకాదు ఇటీవల తమిళనాడు,కేరళ లో వివిధ ఆలయాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో అకిరా వెళ్తాను అంటే.. సరే అని అన్నా.. ఎందుకనే పవన్ మంచి తండ్రి. తన పిల్లలను ఎంతో ప్రేమగా కేరింగ్ గా చూసుకుంటారు. కనుక తండ్రి దగ్గరకు పిల్లలు వెళ్తా అంటే నేను వద్దు అని ఎందుకు అంటాను.. వెళ్ళమనే చెబుతానని పవన్ పై ప్రశంసల వర్షం కురిపించింది రేణు. తండ్రి పిల్లలు ఎప్పుడూ కలిసి ఉండాలని.. కోరుకుంటానని ఆయనతో పిల్లలు కలవడం తనకు ఓకే చెప్పింది రేణు.

అంతేకాదు తన జాతకంలో రాజకీయ కీయంలో ఎంట్రీ ఉందని.. తనకు బిజేపీ అంటే ఇష్టం కనుక.. ఎప్పుడైనా రాజకీయాల్లో అడుగు పెట్టాలని కోరుకుంటే బిజేపీలోనే జాయిన్ అవుతానని చెప్పింది రేణు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..