AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఏమైపోయిందబ్బా..! ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం విజయ్ చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు. విజయ్ అర్జున్ రెడ్డిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఏమైపోయిందబ్బా..! ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2025 | 7:45 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్‌లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నాడు.

విజయ్ దేవరకొండ చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే పై ఫొటోలో విజయ్ దేవరకొండతో ఉన్న హీరోయిన్ గుర్తుందా.? విజయ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే కెరీర్ బిగినింగ్ లో ద్వారకా అనే సినిమా చేశాడు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విజయ్ నటించిన సినిమా ద్వారక.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అసలు ఈ సినిమా వచ్చిపోయినట్టు కూడా చాలా మందికి తెలియదు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ పేరు పూజాజవేరి.

ఇవి కూడా చదవండి

ఈ అమ్మడు భమ్ బోలేనాథ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, గుజరాతి భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో జగన్నాటకం, రైట్ రైట్, టచ్ చేసి చూడు, 47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు. మిక్సప్ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రెడిట్ కార్డులు వాడేవారికి భారీ శుభవార్త
క్రెడిట్ కార్డులు వాడేవారికి భారీ శుభవార్త
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పెళ్లికూతురుగా ముస్తాబై వస్తుందనుకుంటే.. శవమై ఇంటికి..!
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...