IRCTC: మండుటెండలో ఛిల్ అవ్వాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే బ్యాంకాక్‌ని చుట్టేయండి..
వేసవి సెలవులు వస్తున్నాయంటే చాలు తల్లిదండ్రులు తమ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కొంత మంది ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళాడనికి ఆసక్తిని చూపిస్తే.. మరొకొందరు ఇతర దేశాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. అటువంటి వారి కోసం IRCTC తక్కువ ధరకే థాయ్‌లాండ్ కు వెళ్లేందుకు సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మండే ఎండల్లో ఫుల్ చిల్ అయ్యేందుకు థాయిలాండ్ లో ల్యాండ్ అవ్వచ్చు, ఈ రోజు ఈ టూర్ ప్యాకేజీ డీటైల్స్ తెలుసుకుందాం..

24వ తేదీ ఏప్రిల్ 2025 మొదలయ్యే ఈ టూర్ ప్యాకేజీ మొత్తం మూడు రాత్రులు, 4 పగళ్లు కొనసాగుతుంది. మొదటి రోజు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలు అవుతుంది. ఇక్కడ విమానం ఎక్కడం ద్వారా టూర్ మొదలవుతుంది. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలైన కోరల్ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్‌లో పలు సందర్శనీయ స్థలాల్లో పర్యటించవచ్చు.
టూర్ ఏ విధంగా సాగనున్నదంటే
ఫస్ట్ డే అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంఛి బ్యాంకాక్‌కు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి పట్టయకు వెళ్లి హోటల్లో చెకిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెషప్ అయ్యి అల్పాహారం తినాలి. హోటల్లోనే మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం లంచ్ చేసి పట్టయలో పర్యాటక ప్రాంతాలను సందర్శిచడానికి వెళ్తారు. మొదట జెమ్స్ గ్యాలరీ చూసి.. సాయంత్రం అల్కజార్ షోను చూడడానికి వెళ్ళాల్సి ఉంటుంది. రాత్రి ఇండియన్ రెస్టరెంట్లో డిన్నర్ చేస్తారు. ఈ రోజు రాత్రి పట్టయలో హోటల్లోనే బస చేస్తారు.
సెకండ్ డే: పట్టాయ లో టిఫిన్ తిని కోరల్ ద్వీపానికి పయణం అవుతారు. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు.. స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసి తర్వాత నూంగ్ నుచ్ ట్రోపికల్ గార్డెన్ కు వెళ్తారు. రాత్రి పట్టయకు తిరిగి చేరుకుంటారు. ఇక్కడే డిన్నర్ చేసి రాత్రి స్టే చేయాల్సి ఉంటుంది.
థర్డ్ డే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ చెక్ అవుట్ అయిన తర్వాత సఫారీ వరల్డ్ టూర్ అండ్ మెరైన్ పార్క్ కు వెళ్తారు. సాయంత్రానికి ఆ దేశ రాజధాని బ్యాంకాక్ కు చేరుకోవాలి. అక్కడ ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. షాపింగ్ కూడా చేయవచ్చు. రాత్రి ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది.
ఫోర్త్ డే ఉదయం టిఫిన్ తిని బ్యాంకాక్ సిటీలో చక్కర్లు కొట్టవచ్చు. గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ను సందర్శించి.. సాయంత్రం వరకూ షాపింగ్ కూడా చేయవచ్చు. సాయత్రం ఆరు గంటలకు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. అక్కడ నుంచి హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం అవుతారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే
- సింగిల్ షేరింగ్- రూ.54,600
- డబుల్ షేరింగ్- రూ.47,580
- ట్రిపుల్ షేరింగ్- రూ.47,580
- పిల్లలకు విత్ బెడ్ – రూ.45,390
- విత్ అవుట్ బెడ్ – రూ.40,100
ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు
- హైదరాబాద్ నుంచి బ్యాంకాక్.. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు
- హోటల్ లో బస
- నాలుగు రోజులు టిఫిన్, లంచ్, డిన్నర్
- ప్రయాణ భీమా
- పర్యటించే ప్రాంతాల్లో ప్రదేశాలకు ఎంట్రీ టికెట్లు
ఈ టూర్ కి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








