AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra: హీరో నవీన్ చంద్ర గురించి ఈ విషయాలు తెలుసా ?.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. అలాగే అటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు నవీన్ చంద్ర. ఇటీవలే కలర్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించాడు. గతేడాది అక్టోబర్ 6న విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్వహిస్తున్న దావత్ అనే షోలో ఇంటర్వ్యూ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను బయటపెట్టారు. 

Naveen Chandra: హీరో నవీన్ చంద్ర గురించి ఈ విషయాలు తెలుసా ?.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే..
Naveen Chandra
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2024 | 10:49 AM

Share

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు హీరో నవీన్ చంద్ర. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా మెప్పించాడు. కానీ మెల్లగా అతడు నటించిన సినిమాలు అంతగా విజయం అందుకోలేకపోయాయి. దీంతో అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. అలాగే అటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు నవీన్ చంద్ర. ఇటీవలే కలర్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించాడు. గతేడాది అక్టోబర్ 6న విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్వహిస్తున్న దావత్ అనే షోలో ఇంటర్వ్యూ ఇచ్చాడు నవీన్ చంద్ర. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను బయటపెట్టారు.

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఎక్కడో బళ్లారిలో ఒక మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి ఇండస్ట్రీలోకి ఎలా హీరోగా వచ్చారనే విషయాన్ని చెప్పాడు. సినీ పరిశ్రమలోకి రాకముందు తాను డ్యాన్స్ టీచర్ గా పనిచేసేవాడినని.. అప్పట్లో ఆర్కుట్ అనే సోషల్ మీడియా ఉండేదని.. అందులో తన ఫోటోస్ చూసి డైరెక్టర్ హను రాఘవపూడి పిలిచి మరీ తనకు హీరోగా అవకాశమిచ్చారని అన్నారు. అలా అందాల రాక్షసి సినిమాలో చాన్స వచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే సినిమాల్లోకి రాకముందు నవీన్ చంద్ర డాన్స్ టీచర్ గా వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలు రావడం కష్టమని.. అలాంటి ఛాన్స్ తనకు వచ్చిందని.. తాను హీరో కావాలనుకోలేదని.. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్, వినల్, హీరో ఇలా ఏ పాత్ర వచ్చినా చేసుకుంటూ వెళ్తున్నాని అన్నారు. అందాల రాక్షసి సినిమా కంటే ముందు కన్నడలో రెండు చిత్రాల్లో నటించాడు నవీన్ చంద్ర.

నవీన్ చంద్ర కర్ణాటకలోని బళ్లారిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో పాఠశాల నుంచి డ్యాన్సు, స్కిట్స్ చేసి బహుమతులు గెలుచుకున్నాడు. తెలుగులో అందాల రాక్షసి, దళం, త్రిపుర, అరవింద సమేత వీర రాఘవ, లోకల్ బాయ్, అర్ధ శతాబ్దం, పరంపర, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.