Yash Birthday: రాకింగ్ స్టార్ యశ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?
కన్నడ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన యశ్ కు ఇప్పుడు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సినీ సెలబ్రెటీలు, అభిమానులు యశ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. యష్ ఓవర్ నైట్ లో స్టార్‌గా మారలేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు యశ్.

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు నేడు. యశ్ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యష్‌కి ఇప్పుడు కర్ణాటకలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కన్నడ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన యశ్ కు ఇప్పుడు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సినీ సెలబ్రెటీలు, అభిమానులు యశ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. యష్ ఓవర్ నైట్ లో స్టార్‌గా మారలేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు యశ్. యశ్ తన కెరీర్‌ను సీరియల్స్‌తో ప్రారంభించి, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని పాన్ ఇండియా స్థాయికి విస్తరించాడు.
యష్ తొలి సీరియల్ ‘నంద గోకుల’. ఈ సీరియల్‌లో రాధికా పండిట్ కూడా నటించింది. యశ్ ‘మేల్ బిల్లు’ అలాగే ‘ప్రీతి లడ పేలే’ సీరియల్స్‌లో కూడా నటించారు. ఈ సందర్భంగా యశ్ కు సంబంధించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యశ్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ‘మొగ్గినా మనసు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అక్కడి నుంచి సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు యశ్ స్టార్ హీరో అయ్యాడు. ‘కేజీఎఫ్ 1, 2’ చిత్రల ద్వారా యష్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
‘టాక్సిక్’ టీమ్ నుండి ఏదైనా కొత్త అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. 2025 ఏప్రిల్ నెలలో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. యశ్ కామన్ డిపిని ఇటీవల శివరాజ్‌కుమార్ విడుదల చేశారు. ఈసారి తన పుట్టినరోజు వేడుకలను అభిమానులతో జరుపుకోలేనని యశ్ ముందే చెప్పాడు.
‘What you seek is seeking you’ – Rumi A Fairy Tale for Grown-ups #TOXIChttps://t.co/0G03Qjb3zc@KvnProductions #GeetuMohandas
— Yash (@TheNameIsYash) December 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




