Telugu Cinema: టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. సినిమాలు వదిలేసి సెలూన్‌లో పనిచేసిన హీరోయిన్..
సాధారణంగా సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే అవమానాలు, కష్టాలను భరించి ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు దూరమైపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హీరోయిన్ సైతం అలాంటి జాబితాకు చెందినవారే.

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ వరుస విజయాలను అందుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. అలాగే ఒకప్పుడు స్టార్ స్టేటస్ కలిగిన హీరోయిన్స్.. పెళ్లి తర్వాత సినిమా పరిశ్రమను వదిలి విదేశాల్లో స్థిరపడడం సర్వసాధారణం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ బాలీవుడ్ హీరోయిన్ సైతం పెళ్లి కాగానే ఇండస్ట్రీని వదిలేసి విదేశాలకు వెళ్లిపోయింది. తన భర్త, కుటుంబంతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది. కానీ అదే సమయంలో ఆమె ఒక సెలూన్ లో పనిచేసిందట. ఈ నటి ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మరెవరో కాదండి.. ఒకప్పటి హీరోయిన్ శిల్పా శిరోద్కర్. 90లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తన సోదరి నమ్రతా శిరోద్రక్ బాటలోనే సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది. 1989లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2000లో బ్యాంకర్ అపరేష్ రంజిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతోపాటు విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. సినిమాలు వదిలేసిన తర్వాత, తాను న్యూజిలాండ్‌లో హెయిర్‌డ్రెస్సర్‌గా మారి, సెలూన్‌లో పనిచేశానని తెలిపింది.
వివాహం తర్వాత, శిల్పా శిరోద్కర్ మొదట నెదర్లాండ్స్‌కు, తరువాత తన భర్తతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లారు. అక్కడ తాను తాను హెయిర్‌డ్రెస్సింగ్ కోర్సు చేయాలని ప్లాన్ చేశానని.. ఆ తర్వాత హెయిర్‌డ్రెస్సర్‌గా ఉద్యోగంలో చేరినట్లు తెలిపింది. ఈ ఉద్యోగం తన నటనా జీవితానికి దగ్గరగా ఉందని.. అందులో ఎన్నో మేకప్, ఇతర విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. అలాగే రెండు నెలలపాటు సెలూన్ లో పనిచేసినట్లు తెలిపింది. శిల్పా శిరొద్కర్ సోదరి హీరోయిన్ నమ్రత సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి అన్న సంగతి తెలిసిందే.

Shilpa Shirodkar Latest
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..




