Tollywood : 10 ఏళ్ల వయసులోనే సినీ ఎంట్రీ.. ప్రియుడు చేసిన ఒక్క పోస్టుతో దెబ్బకు కెరీర్ నాశనం.. ఈ హీరోయిన్ ఎవరంటే..
సినీరంగుల ప్రపంచంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కొందరు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అవుతుంటారు. కానీ ఆ తర్వాత స్టార్ డమ్ కాపాడుకోవడంలో విఫలమవుతుంటారు. సినీప్రయాణంలో చేసే పొరపాట్లతో దెబ్బకు సినిమాలకు దూరమవుతుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

సినీ పరిశ్రమలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలి. కానీ కొందరు మాత్రం తమకంటూ ఉన్న గుర్తింపు, స్టార్ స్టేటస్ కాపాడుకోవడంలో విఫలమవుతుంటారు. చాలా మంది ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి కష్టపడి పనిచేసినప్పటికీ సరైన క్రేజ్ తెచ్చుకోలేరు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. విజయం కోసం ఎంతో కష్టపడి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రియా సేన్. 1999లో భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్ మహల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అప్పుడు వయసు కేవలం 19సంవత్సరాలు మాత్రమే.
అంతుక ముందు పదేళ్ల వయసులోనే 1990లో విషకన్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. రియా సేన్ తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్స్. త్రిపురకు చెందిన రియా సేన్ భరత్ దేవ్ వర్మ అనే రాజ కుటుంబంలో జన్మించారు. తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమె నటుడు జాన్ అబ్రహంతో ప్రేమలో ఉందనే రూమర్స్ వినిపించాయి. అలాగే రచయిత సల్మాన్ రష్దీతోపాటు క్రికెటర్ యువరాజ్ సింగ్, శ్రీశాంత్ పేర్లతో ఆమె పేరు ముడిపడి ఉంది. అయితే 2005లో రియా సేన్ ప్రియుడు అష్మిత పటేల్ తో క్లోజ్ గా కలిసి ఉన్న వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియో షేర్ చేసింది అష్మిత పటేల్ అంటూ ఆరోపించింది రియా సేన్.
అప్పట్లో ఇండస్ట్రీలో ఆ వీడియో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో రియా సేన్ కెరీర్ పూర్తిగా పట్టాలు తప్పింది. ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ వీడియో లీక్ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది రియా సేన్. అదే సమయంలో ఆమె నటించిన 12 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. అటు సినిమా రంగంలో.. ఇటు వ్యక్తిగత జీవితంలో వివిధ వివాదలతో మానసికంగా కృంగిపోయిన రియా సేన్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..