Actress : చేసిందే ఒక్క సినిమా.. గూగుల్ నే ఆగం చేసిన నెటిజన్స్.. ఈ అమ్మడు క్రేజ్ చూస్తే అంతే ఇక..
ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా మూవీ లవర్స్ ను ఆగం చేసింది ఈ హీరోయిన్. గతేడాది ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ బ్యూటీ. ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ లో తెగ సెర్చ్ చేశారు. కానీ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడంతో అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు.

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లుగా గుర్తింపు రావడం చాలా కష్టం. ఒకవేళ మంచి అవకాశం అందుకుని తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆ స్టార్ డమ్ కాపాడుకోవడం సైతం అంత సులభమైన విషయం కాదు. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో కొన్ని నిమిషాలపాటు నటించిన సీన్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో నెట్టింట ఆమె పేరు మారుమోగింది. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది, ఆమె చేసిన చిత్రాలలో ఒకటి హిట్ అయింది. ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ. ఒకే ఒక్క సినిమా ఈ నటి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది.
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సందీప్ రెడ్డి, యానిమల్ చిత్రంతో బాలీవుడ్‌ను షేక్ చేశాడు. ఇందులో రణబీర్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ హీరో అనిల్ కపూర్ కీలకపాత్రలో నటించారు. అయితే ఇందులో త్రిప్తి డిమ్రి సైతం చిన్న పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె పాత్ర నిడివి తక్కువ సమయమే ఉన్నప్పటికీ ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‌బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
యానిమల్ తర్వాత బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 3 వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. యానిమల్ తర్వాత త్రిప్తి పేరు మారుమోగింది. దీంతో గతేడాది గూగుల్ లోఅత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..