AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇంటర్‏లో టాపర్.. IAS కావాలనుకుని ఇండస్ట్రీలోకి .. 11 ఏళ్లుగా ఒక్క హిట్టు కోసం వెయిట్ చేస్తోన్న హీరోయిన్..

ఆమె యాక్టర్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తార. చిన్నప్పటి చదువులలో ఆమె ముందుండేది. IAS కావాలనుకున్న ఆ అమ్మాయి.. దాదాపు 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.

Tollywood: ఇంటర్‏లో టాపర్.. IAS కావాలనుకుని ఇండస్ట్రీలోకి .. 11 ఏళ్లుగా ఒక్క హిట్టు కోసం వెయిట్ చేస్తోన్న హీరోయిన్..
Raashii Khanna
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 4:19 PM

Share

సాధారణంగా చాలా మంది నటీనటులు సినిమా పరిశ్రమలోకి రావాలని అనుకోకుండానే ఎంట్రీ ఇచ్చినవారున్నారు. కానీ ఇండస్ట్రీలో అద్భుతమైన నటనతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం ఎప్పుడూ గ్లామర్ ప్రపంచంలో భాగం కావాలని కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఇదే సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుంది. చిన్నప్పటి నుంచి IAS ఆఫీసర్ కావాలనుకుంది. అందుకే చదువులలో ఎప్పుడూ ముందుండేది. ఇంటర్ లో టాపర్.. కట్ చేస్తే అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగులో యంగ్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ఆమె దాదాపు 11 సంవత్సరాలుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రాశి ఖన్నా.

1990 నవంబర్ 30న జన్మించిన రాశిఖన్నా.. ఢిల్లీలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదని చెప్పుకొచ్చింది. చదువు అంటే తనకు చాలా ఇష్టమని.. మొదట్లో తాను సింగర్ కావాలనుకున్నానని.. ఆ తర్వాత కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని.. IAS కి ప్రిపేర్ అయి ఆఫీసర్ కావాలని అనుకున్నానని.. కాను ఆకస్మాత్తుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది. మోడల్ లేదా నటిని కావాలని ఎప్పుడూ కలలు కనలేదని.. తెలిపిందే. కెరీర్ మొదట్లో తనకు ప్రకటనల ఏజెన్సీలో కాపీ రైటర్ గా ఉద్యోగం వచ్చిందని.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనేక యాడ్స్ చేసినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఘాజిత్ సర్కార్ జాన్ అబ్రహం సరసన మద్రాస్ కేఫ్ చిత్రంలో ఎంపిక చేయడంతో సినీ ప్రయాణం స్టార్ట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులోయంగ్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల మూవీలో అంతగా అవకాశాలు రాలేదు. అలాగే దాదాపు 11 ఏళ్లుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లుగా హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..