- Telugu News Photo Gallery Cinema photos Prabhas The Rajasaab to Ram Charan Peddi latest movie updates from film industry
Tollywood Updates: ది రాజాసాబ్ కథపై దర్శకుడు క్లారిటీ.. పెద్ది టీమ్ నుంచి అప్‌డేట్..
రాజాసాబ్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి. విశ్వంభర షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తోంది పెద్ది టీమ్. కియారా కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. రిలీజ్‌కు ముందే వరుస రికార్డులు క్రియేట్ చేస్తుంది రజనీకాంత్ కూలీ.
Updated on: Jun 21, 2025 | 4:04 PM

ది రాజాసాబ్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి. ఇది హారర్ కామెడీ మూవీ అయినా... ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉంటాయన్నారు. ఓ తాత, నానమ్మ, మనవడి మధ్య జరిగే కథగా ది రాజాసాబ్ తెరకెక్కుతుంది అన్నారు. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మేకింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్యాన్స్ వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఖుషి అవుతున్నారు.

విశ్వంభర షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. ఒక్క ఐటమ్ సాంగ్ మినహా మిగతా షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్టుగా వెల్లడించారు మేకర్స్. త్వరలోనే ఆ పోర్షన్ కూడా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు చిరు.

వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తోంది పెద్ది టీమ్. ప్రస్తుతం యాక్షన్ సీన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న యూనిట్, అందుకోసం ప్రత్యేకంగా రైలు సెట్‌ను రూపొందించింది. నవకాంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్‌ను ఈ నెల 19 వరకు ఇదే సెట్‌లో షూటింగ్ చేయబోతున్నారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్‌కు ముందే వరుస రికార్డులు క్రియేట్ చేస్తుంది రజనీకాంత్ కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా ఓవర్‌సీస్ రైట్స్ 80 కోట్ల ధర పలికాయి. తమిళ సినిమా చరిత్రలో ఇదే హయ్యస్ట్ నెంబర్ కావటం విశేషం.

కియారా కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. ప్రస్తుతం కియారా గర్భవతి కావటంతో ఆమె కోసం బెంగళూరులో జరగాల్సిన షూటింగ్‌ను ముంబైకి షిఫ్ట్ చేశారు. కేజీఎఫ్ 2 తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.




