AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 15 ఏళ్ల వయసులోనే పెళ్లి.. పసిబిడ్డతో సెట్స్‏కు.. నలుగురు సీఎంలతో కలిసి నటించిన హీరోయిన్..

ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. ఆ తర్వాత వయసుకు తగినట్లుగా సహాయ పాత్రలతో మెప్పించింది. దశాబ్దాలపాటు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆతర్వాత పసిబిడ్డతో సినిమా సెట్స్ కు వచ్చింది. ఆమె నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. పద్మ శ్రీ సహా అనేక అవార్డ్స్ గెలుచుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : 15 ఏళ్ల వయసులోనే పెళ్లి.. పసిబిడ్డతో సెట్స్‏కు.. నలుగురు సీఎంలతో కలిసి నటించిన హీరోయిన్..
Sowcar Janaki
Rajitha Chanti
|

Updated on: May 14, 2025 | 5:43 PM

Share

ఒకప్పుడు సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 3 నెలల పసిపాపతో నటించడానికి సినిమా సెట్స్ కు వచ్చింది. సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమెనలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించి మెప్పించింది. అంతేకాదు.. దశాబ్దాల సినీప్రయాణంలో పద్మ శ్రీ సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె మరెవరో కాదు.. షావుకారు జానకి. ఆమె సినీప్రయాణం ఎంతోమందికి గర్వకారణం. 1931లో విలీనమైన మద్రాస్ ప్రెసిడెన్సీలోని గోదావరి జిల్లాలో జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేసింది. ఆమె గొంతు విన్న తర్వాత ప్రముఖ తెలుగు నిర్మాత తన సినిమాలో నటించమని సంప్రదించారు. కానీ ఆమె కుటుంబం అందుకు నిరాకరించి పెళ్లి ఏర్పాట్లు చేసింది.

15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో 3 నెలల పసిబిడ్డతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె సోదరుడు నిర్మిస్తున్న ఓ చిత్రానికి జానకిని సిఫార్స్ చేశాడు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్టీఆర్ సరసన షావుకారు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 1947లో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత జెమిని గణేషన్ తెరకెక్కించిన సినిమాలో నటించింది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన ‘కులకొజుంధు’ చిత్రంలో జానకి నటించారు. అలాగే జయలలిత, ఎంజీఆర్ తో కలిసి ఓ సినిమాలో నటించారు. శివాజీ, నాగేశ్వరరావు, రాజ్‌కుమార్, ప్రేమ్ నజీర్ సహా ఒకప్పటి అగ్ర హీరోలతో కలిసి నటించారు.

ఆమె ఎం.ఆర్.రాధతో కలిసి కుముదం చిత్రంలో నటించారు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన షావుకారు జానకి ఆ తర్వాత వయసుకు తగినట్లుగా సహయ పాత్రలు పోషించారు. గత 70 ఏళ్లుగా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. షావుకారు జానకి.. తమిళనాడులోని ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. కరుణానిధి, ఎంజిఆర్, జయలలిత. 1968లో అన్నా నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..