Sachin Tendulkar: సచిన్‌కే పోటీ ఇచ్చిన క్రికెటర్.. క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు హీరో..
క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి ఆడుతూ తన కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ ఎంతో ఇష్టపడిన క్రికెట్ వదిలి సినీరంగాన్ని ఎంచుకున్నాడు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో సచిన్ తో కలిసి కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసుకుందామా.

క్రికెట్.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఆట. కానీ మన దేశంలో క్రికెట్ కు, సినిమాకు మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ వంటి చాలా మంది హిందీ సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు. కానీ మీకు ఒక నటుడి గురించి తెలుసా..? అప్పట్లో సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఆడటం ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా నటనవైపు ఆసక్తి చూపించాడు. దీంతో క్రికెట్ వదిలి నటుడిగా మారాలని సినీరంగంలోకి అడుగుపెట్టాడు. కానీ సినిమాల్లో కాకుండా టీవీ స్టార్ అయ్యాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతడికి అంతగా అవకాశాలు రాలేదు. కానీ బుల్లితెరపై హీరోగా మెప్పించాడు. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడినప్పుడు అద్భుతమైన క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆసమయంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. వీరిద్దరు ఒకేసారి క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అతడు మరెవరో కాదండి.. హిందీలో ఫేమస్ అయిన కామెడీ షో స్స్‌ష్ కోయ్ హై ద్వారా పాపులర్ అయిన సలీల్ అంకోలా.
సలీల్ అంకోలా.. కుడిచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్. 1989, 1997 మధ్య 20 వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక కలిసి నిర్వహించిన 1996 క్రికెట్ ప్రపంచ కప్ కూడా ఉంది. అయితే సలీల్ ఆ సమయంలో వరుసగా దారుణమైన ప్రదర్శనలు ఇచ్చాడు. దీంతో 28 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 1997లో చాహత్ ఔర్ నఫ్రత్ అనే టీవీ సీరియల్ ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కోరా కాగజ్, కెహ్తా హై దిల్, విక్రాల్ ఔర్ గబ్రాల్ , రిష్టే వంటి సీరియల్స్ చేశాడు.
2000 చివరలో అతడికి ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. దీంతో మధ్యానికి బానిసయ్యాడు. ఆ వ్యసనం నెమ్మదిగా సలీల్ కెరీర్ పై ప్రభావం చూపించింది. దీంతో అతడి 19 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిపోయింది. 2011లో తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. కానీ కొన్నాళ్లకు అతడిలోని మార్పు వచ్చింది. 2016 నుంచి 2018 వరకు ప్రసారమైన సీరియల్ దాతా శనిలో సూర్య దేవుడి పాత్రలో కనిపించాడు. ఇందులో అతడి నటనకు ప్రశంసలు వచ్చాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..




