AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటమ్మడు ఇది నువ్వేనా.. ? పవన్ కళ్యాణ్‏తో సూపర్ హిట్ మూవీ.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

గ్లామర్ ప్రపంచంలో నటీగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇంతకీ ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. ?

Tollywood: ఏంటమ్మడు ఇది నువ్వేనా.. ? పవన్ కళ్యాణ్‏తో సూపర్ హిట్ మూవీ.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
Sarah Jane Dias.jp
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2025 | 8:37 PM

Share

మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అంతగా అదృష్టం కలిసిరాలేదు. ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఆమె.. ఇప్పుడు బక్కిచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ సైతం అంతగా ఆఫర్స్ రాలేదు. ఆడపాదడపా చిత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే సారా జేన్ డయాస్. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ పంజా మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 2011లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఆ సినిమాలో సారా కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా.. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ఆ తర్వాత హిందీలోనే సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆకస్మాత్తుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

అలాగే ఇప్పుడిప్పుడే హిందీలో కొన్ని అవకాశాలు అందుకుంటుంది. సారా ఒమన్ దేశానికి చెందిన అమ్మాయి. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. తర్వాత సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చింది. మొదట్లో పలు టీవీ షోస్ చేసిన ఈ అమ్మడు.. తమిళంలో ఓ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పంజా మూవీలో కనిపించింది. చివరగా 2017లో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?