- Telugu News Photo Gallery Cinema photos Ananya Nagalla Says About Her Love and Break Up and Film Career
Tollywood: ఇండస్ట్రీలోకి రాగానే లవ్ బ్రేకప్.. ఆ బాధను తట్టుకోలేకపోయా.. టాలీవుడ్ హీరోయిన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే యంగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ ఆమె. భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. తాజాగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
Updated on: Jun 20, 2025 | 7:20 PM

ప్రస్తుతం సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఆమె.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు.. కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ఓ ఇమేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో లవ్, ఫెయిల్యూర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అనన్య నాగళ్ల. కెరీర్ పరంగా ఒడిదుడుకులు, సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నానని.. ప్రశంసలతోపాటు విమర్శలను సైతం తట్టుకున్నానని అన్నారు. కానీ జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం ఎంతో బాధపడ్డానని.. ఆ బాధను తట్టుకోలేకపోయానని అన్నారు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే బ్రేకప్ జరిగిందని.. రెండేళ్లపాటు ఆ బాధను అనుభవించానని.. కానీ ఆ బాధను చేసేపనిపై మాత్రం పడనీయలేదని అన్నారు. రాత్రంతా ఏడ్చేసి ఉదయాన్నే జిమ్ కు వెళ్లిపోయేదాన్ని అని.. కారవన్ లో ఏడ్చేసి ఆ తర్వాత ఏం జరగనట్లు బయటకు వచ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.

తన లవ్, బ్రేకప్ గురించి ఇంట్లో వాళ్లకు తెలియదని.. కేవలం తన స్నేహితులకు మాత్రమే తెలుసనని అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓప్రాజెక్ట్ చేస్తున్నానని అన్నారు. ఆ సినిమా కథానాయికకు ప్రాధాన్యమున్న ప్రాజెక్ట్ అని అన్నారు. అనన్య నాగళ్ల తెలుగులో మల్లేశం సినిమాతో తెరంగేట్రం చేశారు.

2018లో విడుదలైన ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో శాకుంతలం, తంత్ర, డార్లింగ్ ఇలా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల పొట్టేల్ సినిమాలో నటనకుగానూ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకుంది.




