Tollywood: నటనపై ఆసక్తి.. కలెక్టర్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. నటుడిగా జాతీయ అవార్డ్..

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నటీనటులుగా కొనసాగుతున్న చాలా మంది అంతకు ముందు వేరే రంగాల్లో పనిచేసినవారే. కొందరు డాక్టర్స్, లాయర్స్, ఇంజనీరింగ్ చదివి అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టినట్లు ఇదివరకు విన్నాం. కానీ మీకు తెలుసా.. ? యాక్టింగ్ అంటే ఇష్టంతో కలెక్టర్ జాబ్ మానేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా.. ?

Tollywood: నటనపై ఆసక్తి.. కలెక్టర్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. నటుడిగా జాతీయ అవార్డ్..
Papa Rao Biyyala

Updated on: Jul 21, 2025 | 11:47 AM

ప్రస్తుతం సినీరంగంలో చాలా మంది స్టార్స్ చిన్నప్పటి నుంచి ఏదోక రంగంలో స్థిరపడాలని అనుకుంటారు. డాక్టర్స్, లాయర్స్ కావాలనుకుని అనుహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ కలెక్టర్ జాబ్ మానేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓ వ్యక్తి గురించి మీకు తెలుసా.. ? నిజానికి మన దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగానికి ఎంత గౌరవం ఉంటుందో చెప్పక్కర్లేదు. ఐఏఎస్ ఉత్తీర్ణులు కావాలని ఎంతో మంది కలలు కంటారు. అందుకే చాలా మంది యూపీఎస్సీ పరీక్షలకు సుధీర్ఘకాలంగా ప్రీపేర్ అవుతుంటారు. కానీ మీకు తెలుసా.. ? ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.. ఒకప్పుడు కలెక్టర్. అవును.. నటనపై ఆసక్తి ఆయనను సినిమా వైపు నడిచేలా చేసింది. దీంతో తన ఉద్యోగాన్ని వదిలి సినిమా వైపు అడుగులు వేశారు.

కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలేసినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం విజయం సాధించారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆయన పేరు బీవీపీ రావు అలియాస్ పాపారావు బియ్యాల. 1982 బ్యాచ్ IAS అధికారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన..30 సంవత్సరాలు వివిధ ప్రాంతాల్లో ఎన్నో పదవులలో పనిచేశారు. 1994 నుంచి 1997 వరకు అస్సాం హోం కార్యదర్శిగా.. ఆ తర్వాత 1999 లో ఐక్యరాజ్య సమితి మిషన్ కింద కొసావోలో పౌర వ్యవహారాల అధికారిగా పనిచేశారు. ఇక 2014 నుంచి 2019 వరకు తెలంగాణ ప్రభుత్వ విధాన సలహాదారుడిగా పనిచేసారు. ఈ పదవి క్యాబినెట్ మంత్రి హోదాకు సమానం.

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

ఇవి కూడా చదవండి

Papa Rao Biyyala Movies

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న ఆయన..ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన స్నేహితుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాప్ ఆల్టర్. పాపారావును జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన చిత్రనిర్మాత జాహ్ను బారువాకు పరిచయం చేశారు. 1996లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి చిత్ర నిర్మాణంలో డిప్లొమా పూర్తి చేశారు. ఆయన తెరకెక్కించిచన విల్లింగ్ టూ సాక్రిఫైస్ అనే షార్ట్ ఫిల్మ్ జాతీయ అవార్డ్ అందుకుంది. దీంతో 2020లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రాజీనామా చేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చారు. 2023లో మ్యూజిక్ స్కూల్ సినిమాను రూపొందించారు. ఇందులో శ్రియ శరణ్, శర్మన్ జోషి ప్రధాన పాత్రలలో నటించారు.

Paparao Biyyala Life

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..