AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాలు వదిలేసి సైన్యంలో చేరిన ఏకైక హీరో.. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి..

సినీరంగంలో అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా వయసుకు తగిన పాత్రలలో నటిస్తున్నాడు. కానీ మీకు తెలుసా.. ? హీరోగా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే కార్గిల్ యుద్ధంలో చేరి సేవలు అందించాడు.

Tollywood: సినిమాలు వదిలేసి సైన్యంలో చేరిన ఏకైక హీరో.. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి..
Nana Patekar
Rajitha Chanti
|

Updated on: May 10, 2025 | 7:19 AM

Share

భారత్ పై పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. జమ్మూ, శ్రీనగర్ సహా… సరిహద్దు గ్రామాల్లోని జనవాసాలపై భారీగా దాడులు చేస్తోంది. వీటిని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు ఆపరేషన్ సింధూర్ 2 పై సినీప్రముఖులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? సినీరంగంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరో.. ఆర్మీలో చేరి కార్గిల్ యుద్ధం చేశాడు. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అద్భుతమైన నటనకు ఏకంగా మూడు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో విశేషమైన సేవలు అందించాడు. ఇంతకీ అతడు ఎవరంటే.. ? అతడే బాలీవుడ్ స్టార్ హీరో నానా పటేకర్.

హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు నటుడు నానా పటేకర్. హీరోగానే కాకుండా పాత్రకు తగినట్లుగా సహయ నటుడిగానూ కనిపించాడు. నానా పటేకర్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. 1990 తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠ లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా చేరాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే కోరికను తెలిపాడు. అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే ఆర్మీలో చేరేందుకు ఆయనకు అనుమతి వచ్చింది. అలా 1999 ఆగస్టులో నానా పటేకర్ రెండువారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు.

అక్కడ సైనికులకు సాయం చేశాడు… అలాగే బేస్ హాస్పిటల్లో పనిచేశాడు. అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని… శ్రీనగర్ కు వెళ్లేటప్పుడు తాను 76 కిలోల బరువు ఉన్నానని.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో చెప్పుకొచ్చాడు. కార్గిల్ యుద్దం ముగిసిన తర్వాత తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు. సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధం చేసిన ఏకైక హీరో నానా పటేకర్.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్.