AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఇవేనట..

సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అచ్చమైన పల్లెటూరి కథఇది. ఈ సినిమా మన ఇంట్లోనో.. లేక మన పక్కింటోనో జరుగుతున్నట్టు ఉంటుంది. కుటుంబాలు, అనుబంధాల గురించి చెప్పే ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఇవేనట..
Maheshbabu , Venkatesh
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2025 | 12:02 PM

Share

తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు కదలకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మార్చి 7న రీరిలీజ్ కాబోతుంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ ను పెద్దోడు చిన్నోడు అని పిలుస్తూ ఉంటారు.

అయితే ఈ సినిమాలో  వెంకటేష్‌కు మల్లికార్జున, మహేష్ బాబుకు సీతా రామరాజు అని పేర్లు పెట్టుకొని కథ రాసుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. అయితే సినిమాలో అంజలి పాత్ర పేరు సీత కాబట్టి మహేష్ బాబు పేరు విషయంలో గందరగోళం నెలకొంటుందని అనుకున్నారట. మరోసారి వీరిద్దరికి రాముడు, లక్ష్మణుడు అనే పేర్లు పెడదాం అని కూడా అనుకున్నారట ఇక లాభం లేదు అని పెద్దోడు చిన్నోడు అని ఫిక్స్ సి చేశారట. ఇక  మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ గ్లోబల్ మూవీగా తెరకెక్కుతుంది. అలాగే వెంకటేష్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..