Thalapathy Vijay: భగవంతుడు నా చెల్లిని దూరం చేశాడు.. దళపతి విజయ్ ఎమోషనల్

తెలుగు సినిమాలను చాలా తమిళ్ లో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు విజయ్. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాలను విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అలాగే విజయ్ నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇటీవల విజయ్ నటించిన లియో పేక్షకుల ముందుకు వచ్చింది.

Thalapathy Vijay: భగవంతుడు నా చెల్లిని దూరం చేశాడు.. దళపతి విజయ్ ఎమోషనల్
Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: May 25, 2024 | 3:26 PM

దళపతి విజయ్ గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నారు విజయ్. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమాలను చాలా తమిళ్ లో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు విజయ్. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాలను విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అలాగే విజయ్ నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇటీవల విజయ్ నటించిన లియో పేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు లైనప్ చేశాడు. త్వరలోనే గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అయితే విజయ్ కు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ చెల్లెలి గురించి ఓ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. విజయ్ చెల్లి గురించి చాలా మంచికి తెలియదు. విజయ్ కు విద్య అనే చెల్లి ఉంది. కానీ ఆమె కేవలం నాలుగు ఏళ్ల వయసులో కనుమూసింది. చిన్న వయసులోనే విద్య అనారోగ్యంతో కన్నుమూసింది.  విజయ్ తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే.. విజయ్ తండ్రి ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌ఏ చంద్రశేఖర్‌ అలాగే విజయ్ తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాగే విజయ్ కు విద్య అనే చెల్లి ఉంది. ఆమె మరణించి ఇప్పటికి సరిగ్గా 40ఏళ్లు అవుతుంది. ఆమె సమాధికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో విజయ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  విద్య అంటే విజయ్ కు చాలా ఇష్టం.. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విద్యతో ఆడుకుంటాడు. విద్య పక్కే నిద్రపోతాడు విజయ్. అలాగే తన తల్లి విద్యకు స్నానం చేసేటప్పుడు.. విజయ్ కూడా తన చెల్లికి స్నానం చేయించేవాడట. చెల్లి మరణం తో విజయ్ చాలా కుంగిపోయాడని తన తల్లి చెప్పారు. అలాగే విజయ్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా జీవితంలో ఎక్కువ ప్రభావం చూపింది నా చెల్లి మరణం. నా చెల్లి మరణం నాకు తీరని లోటు. నా చెల్లిని దూరం చేసిన ఆ దేవుడు.. చాలా మంది చెల్లెళ్లను నా ఫ్యాన్స్ రూపంలో ఇచ్చాడు. వాళ్లలోనే నేను నా చెల్లిని చేసుకుంటున్నా అని గతంలో విజయ్ అన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.