AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తండ్రి టాప్ కమెడియన్.. కొడుకు IAS ఆఫీసర్.. ఇప్పుడు ఆ జిల్లాలో కలెక్టర్‏గా పనిచేస్తూ..

సినీరంగంలో తండ్రి టాప్ కమెడియన్. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అలరించారు. కానీ ఆయన కొడుకు మాత్రం సినిమాల్లోకి కాకుండా మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఓ జిల్లాకు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

Tollywood : తండ్రి టాప్ కమెడియన్.. కొడుకు IAS ఆఫీసర్.. ఇప్పుడు ఆ జిల్లాలో కలెక్టర్‏గా పనిచేస్తూ..
Shrutanjay Narayanan
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2025 | 9:05 PM

Share

సినిమా ప్రపంచంలో స్టార్స్ వారసులు తమ తండ్రిలాగే నటులుగా పరిచయం అవుతుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలా మంది స్టార్ హీరోల పిల్లలు నటనవైపు అడుగులు వేస్తుంటారు. అలాగే కొందరు మాత్రం ఇప్పుడు హీరోలుగా, నటీనటులుగా కాకుండా, నిర్మాతలుగా, దర్శకులుగా, మ్యూజిక్ డైరెక్టర్స్ గా మారుతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ కుర్రాడు మాత్రం తన తండ్రిలాగా సినీరంగాన్ని కాకుండా మరో మార్గాన్ని ఎంచుకుననారు. ఇప్పుడు అతడు IAS అధికారిగా దేశానికి సేవ చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. తమిళ హాస్యనటుడు చిన్ని జయంత్ కుమారుడు IAS అధికారి శ్రుతంజయ్ నారాయణన్. కృష్ణమూర్తి నారాయణన్ అలియాస్ చిన్ని జయంత్ తమిళ సినిమాల్లో ఫేమస్ యాక్టర్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

చిన్ని జయంత్ 1980లో తన కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. కానీ అతడి తనయుడు శ్రుతంజయ్ నారాయణన్.. సినిమా కాకుండా వేరే కెరీర్‌ను ఎంచుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలో పెరిగిన శ్రుతంజయ్.. ప్రజా పరిపాలన సేవ చేయాలనుకున్నాడు. అందుకే చిన్నప్పటి నుంచి చదువులపై దృష్టి పెట్టాడు. గిండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అశోక విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, శ్రుతంజయ్ కొంతకాలం ఒక స్టార్టప్‌లో పనిచేశాడు. కానీ ఎప్పుడూ IAS ఆఫీసర్ కావాలనుకున్నాడు. అటు ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాడు. 2015లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 75వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. శ్రుతంజయ్ ప్రస్తుతం తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో, ఆయన విల్లుపురం జిల్లాలో అదనపు కలెక్టర్‌గా పనిచేశారు, గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పథకాలను అమలు చేశారు.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

Shrutanjay Narayanan New

Shrutanjay Narayanan New

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం