Tollywood: తల్లి చనిపోయిన తర్వాత బద్ద శత్రువులగా మారిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. స్టార్ హీరోయిన్‌కు చెల్లితో గొడవ..?
దక్షిణాదిలో ఆమె స్టార్ హీరోయిన్. చెల్లెల్లంటే ప్రాణం. సినిమా షూటింగ్స్ కోసం తన చెల్లితోనే వచ్చేది. ఆమె స్టార్ హీరోయిన్ కాగా.. తనకు చెల్లెలే మేనేజర్. కానీ తల్లి చనిపోయిన తర్వాత ఇద్దరు అక్కాచెల్లెళ్లు బద్ద శత్రువులుగా మారారు. ఇద్దరి మధ్య అసలేం జరిగింది అనే విషయాలు ఎవరికీ తెలియదు. అక్క ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా.. ?

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ తల్లి చనిపోయిన తర్వాత ఆమె తన చెల్లికి మధ్య దూరం పెరిగిపోయింది. ఇద్దరు శత్రువులుగా మారారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే దివంగత హీరోయిన్ శ్రీదేవి. ఆమె తన కెరీర్‌లో 300 కి పైగా చిత్రాలలో పనిచేసింది. శ్రీదేవి సోది పేరు శ్రీలత. ఒకప్పుడు ఇద్దరు ప్రాణంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. 1970లలో శ్రీదేవి నటనా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు, శ్రీలత ఆమె పక్కన నీడలా ఉండేది. శ్రీదేవి ప్రతి సినిమా షూటింగ్ సెట్ కు అక్కతో కలిసి వచ్చేసింది. శ్రీలత సైతం నటి కావాలని కలలు కన్నారు. కానీ అది జరగలేదు. చివరకు శ్రీదేవికి మేనేజర్ అయ్యారు.
1996లో శ్రీదేవి, శ్రీలత జీవితాల్లో ఒక ప్రధాన సంఘటన జరిగింది. అనార్గోయ సమస్యతో ఇబ్బందిపడుతున్న తల్లిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ జరిగిన ఆపరేషన్ తప్పు జరగడంతో ఆమె తల్లి ఆరోగ్యం క్షీణించి మరణించారు. అయితే ఈ కేసులో శ్రీదేవికి ఆసుపత్రి నుంచి రూ.7.2 కోట్ల నష్టపరిహారం వచ్చింది. కానీ ఆ మొత్తం నగదు శ్రీదేవి వద్దే ఉండడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య అంతరం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీదేవి తన తల్లి ఆస్తిని తన పేరు మీద బదిలీ చేసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. తన తల్లి ఆస్తిని తనకు కూడా రావాలంటూ కోర్టును ఆశ్రయించింది శ్రీలత. కానీ ఈ కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో శ్రీలతకు రూ.2 కోట్లు వచ్చాయి.
ఇద్దరి మధ్య వచ్చిన గొడవను బోనీ కపూర్ రాజీ చేయడానికి ప్రయత్నించాడట. 2013లో శ్రీదేవి పద్మశ్రీ అందుకున్న తర్వాత శ్రీలత ఒక కుటుంబ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అప్పట్లో టాక్ నడిచింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తగ్గలేదు. శ్రీదేవి 2018లో దుబాయ్‌లో హఠాత్తుగా మరణించారు. శ్రీలత ఆమె అంత్యక్రియలకు లేదా చెన్నైలో జరిగిన ప్రార్థన సమావేశంలో పాల్గొనలేదు.

Sridevi Sisters
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..




