Shah Rukh Khan: ప్రపంచంలోనే అతి పొడవైన కారు.. ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు.. కేవలం షారుఖ్ సొంతం.. ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక అనుబంధం..
భారతీయ రోడ్లపై ఈ లిమోసిన్‌లు తిరగడానికి అనుమతి లేదు. కానీ మన దేశంలో ఈ లిమోసిన్ కారు కేవలం ఒకే ఒక్క హీరో వద్ద ఉంది. ఈ విలాసవంతమైన లిమోసిన్‌కు యజమానిగా ఎవరంటే.. అతడే బాలీవుడ్ రారాజు 'షారుక్ ఖాన్.' కేవలం నటనతోపాటు బాద్ షాకు అనేక వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సొంతంగా నిర్మాణ సంస్థ, VFX స్టూడియోను కలిగి ఉన్నాడు. ముంబైతో పాటు, లండన్, దుబాయ్‌లలో విలాసవంతమైన ఇళ్లను కలిగి ఉన్నాడు.

లిమోసిన్ కారు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు. ఇది ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక భారతదేశంలో చూడడం చాలా అరుదు. ఈ కారును హాలీవుడ్ సినిమాల్లో బ్యాచిలర్ పార్టీ లేదా విలాసవంతమైన జీవనశైలిని చూపించడానికి మాత్రమే ఈ పొడవైన లిమోసిన్‌లను ఉపయోగిస్తారు. అందులో కూర్చుని హాయిగా పార్టీ చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ రోడ్లపై ఈ లిమోసిన్‌లు తిరగడానికి అనుమతి లేదు. కానీ మన దేశంలో ఈ లిమోసిన్ కారు కేవలం ఒకే ఒక్క హీరో వద్ద ఉంది. ఈ విలాసవంతమైన లిమోసిన్‌కు యజమానిగా ఎవరంటే.. అతడే బాలీవుడ్ రారాజు ‘షారుక్ ఖాన్.’ కేవలం నటనతోపాటు బాద్ షాకు అనేక వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సొంతంగా నిర్మాణ సంస్థ, VFX స్టూడియోను కలిగి ఉన్నాడు. ముంబైతో పాటు, లండన్, దుబాయ్‌లలో విలాసవంతమైన ఇళ్లను కలిగి ఉన్నాడు. షారుక్ ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చురుకుగా ఉన్నాడు. దుబాయ్ నుండి షారుఖ్ ఖాన్ రాయల్ ఎస్టేట్‌ను ప్రారంభించాడు
అయితే ఈ బ్రాండ్‌లో షారుఖ్ 2014 సంవత్సరంలో లిమోసిన్‌ను కూడా కొనుగోలు చేశాడు. షారుక్ ఖాన్ ప్రత్యేక సందర్భాలలో తన కుటుంబంతో కలిసి లిమోసిన్‌లో ప్రయాణించడానికి ఇష్టపడతాడు. అయితే షారుఖ్ ఈ లిమోసిన్‌కు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. అదేంటంటే.. 2018లో కామన్వెల్త్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ హాజరైనప్పుడు, ఆయన తన హోటల్ నుండి ఈవెంట్ జరిగే ప్రదేశానికి వెళ్లడానికి ప్రోటోకాల్ ప్రకారం లగ్జరీ సెడాన్ లిమోసిన్‌ను ఉపయోగించారు. ప్రధాని మోదీ మాత్రమే ఈ 100 మీటర్ల పొడవైన కారులో ప్రయాణించారు. 2014 సంవత్సరంలో కూడా ఖాన్ కుటుంబం దుబాయ్ రాజకుటుంబాన్ని కలవడానికి ఈ విలాసవంతమైన కారును ఉపయోగించింది.
View this post on Instagram
నిజానికి, అమితాబ్ బచ్చన్ నుండి హృతిక్ రోషన్ వరకు చాలా మంది భారతీయ నటులకు ఈ కార్లంటే చాలా ఇష్టం. భారత ప్రభుత్వం లిమోసిన్లను అనుమతిస్తే, ఈ పొడవైన వాహనాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి అనేక నగరాల్లో ఖచ్చితంగా తిరుగుతాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.