Chandramukhi 2: చంద్రముఖి 2లో కంగనా రనౌత్ పాత్రను ఆమె చేసుంటే వేరేలా ఉండేది..

ఇక ఈ సినిమా పేరు చెప్పగానే అన్ని పాత్రలు అడియన్స్ కళ్ల ముందు మెదులుతుంటాయి. సూపర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి మూవీపై మరింత క్యూరియాసిటి నెలకొంది. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఇప్పుడు రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Chandramukhi 2: చంద్రముఖి 2లో కంగనా రనౌత్ పాత్రను ఆమె చేసుంటే వేరేలా ఉండేది..
Chandramukhi 2 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2023 | 6:47 PM

సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చంద్రముఖి సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా పేరు చెప్పగానే అన్ని పాత్రలు అడియన్స్ కళ్ల ముందు మెదులుతుంటాయి. సూపర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి మూవీపై మరింత క్యూరియాసిటి నెలకొంది. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఇప్పుడు రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇక సినిమాకు మెయిన్ రోల్ అయిన చంద్రముఖి పాత్రను బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పోషించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే వారంలో అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రముఖి 2కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో టైటిల్ రోల్ కంసో ముందుగా సాయి పల్లవిని సంప్రదించారట. ఆ పాత్రకు ఆమె అయితే బాగుంటుందని భావించారట. నిర్మాతలతోపాటు.. లారెన్స్ కూడా సాయి పల్లవి ఆ రోల్ చేస్తే బాగుంటుందని అనుకున్నారట. సాయి పల్లవి కళ్లతో నటించగలదని.. అంతేకాకుండా డాన్స్ కు ప్రాముఖ్యత ఉండడం వల్ల చంద్రముఖి పాత్రకు ఆమె చక్కగా సూట్ అవుతుందని అనుకున్నారట. కానీ ఈ సినిమా చేసేందుకు సాయి పల్లవి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ అవకాశం బాలీవుడ్ బ్యూటీ కంగనా వద్దకు చేరింది.

ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుండగా.. ఒకవేళ చంద్రముఖి 2 సినిమాలో సాయి పల్లవి నటించి ఉంటే మూవీ పాన్ ఇండియా స్థాయిలో వేరేలా ఉండేదని అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ లో కంగనా లుక్స్ బాగానే ఉన్నాయి. మరీ సినిమాలో ఆమె డాన్స్ ఎలా మెప్పించిందో చూడాలి మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.