AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Bharat Row: మన క్రికెటర్ల జెర్సీలపై ‘భారత్‌’ అని ముద్రించాలి.. అమితాబ్‌, సెహ్వాగ్‌ల ట్వీట్స్‌ వైరల్‌

'భారత్ మాతా కీ జై' అంటూ బిగ్‌బీ ట్వీట్ చేశారు. మరే సందర్భంలోనైనా ఇలా పోస్ట్ చేసి ఉంటే చర్చకు వచ్చేది కాదు. అయితే ఇప్పుడు 'భారత్ వర్సెస్‌ ఇండియా' వివాదం కొనసాగుతోంది. 'ఇండియా' పేరును 'భారత్'గా మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ 'భారత్ మాతా కీ జై' అంటూ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ బచ్చన్ హిందీలో ఈ ట్వీట్ చేశారు. దీనికి మువ్వన్నెల జెండాతో పాటు..

India-Bharat Row: మన క్రికెటర్ల జెర్సీలపై 'భారత్‌' అని ముద్రించాలి.. అమితాబ్‌, సెహ్వాగ్‌ల ట్వీట్స్‌ వైరల్‌
Amitabh Bachchan, Virender
Basha Shek
|

Updated on: Sep 05, 2023 | 5:57 PM

Share

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలకే కాకుండా అనేక అంశాల గురించి తరచూ పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ బిగ్‌బీ ట్వీట్ చేశారు. మరే సందర్భంలోనైనా ఇలా పోస్ట్ చేసి ఉంటే చర్చకు వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ‘భారత్ వర్సెస్‌ ఇండియా’ వివాదం కొనసాగుతోంది. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ‘భారత్ మాతా కీ జై’ అంటూ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ బచ్చన్ హిందీలో ఈ ట్వీట్ చేశారు. దీనికి మువ్వన్నెల జెండాతో పాటు ఎరుపు జెండాతో కూడిన ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్‌ చేసిన మూడు గంటల్లోనే 28వేల మందికి పైగా ఈ ట్వీట్‌ను లైక్‌ చేశారు. అదే సమయంలో ఇప్పుడు ఈ ట్వీట్‌ చేయల్సిన అవసరం ఏముందటూ బిగ్‌బీని ప్రశ్నిస్తున్నారు. అలాగే ‘జయా బచ్చన్‌ (అమితాబ్‌ సతీమణి) మిమ్మల్ని ఏమనడం లేదా? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

జెర్సీలు మార్చాల్సిందే..

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఈ విషయంపై స్పందించాడు. మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాడు. ‘పేరు అనేది మనలో గర్వాన్నినింపేలా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనమంతా భారతీయులం. ఇండియా అనేది తెల్లదొరలు ఇచ్చిన పేరు. మన దేశం అసలైన పేరు భారత్ ను అధికారికంగా తిరిగి పొందడానికి ఇప్పటికే చాలా కాలం వృథాగా గడిచిపోయింది. వన్డే ప్రపంచకప్ లో మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలని బీసీసీఐను, జైషాను కోరుతున్నా’ అని ట్వీట్ చేశాడు సెహ్వాగ్‌. కాగా ‘ఇండియా’ పేరుతో ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం పేరును భారత్‌ నుంచి ‘భారత్‌’గా మార్చాలని నిర్ణయించిందని విమర్శిస్తున్నారు. మొత్తానికి భారత్‌ వర్సెస్‌ ఇండియా వివాదం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అమితాబ్ బచ్చన్ ట్వీట్ ఇదే..

వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ ..

అమితాబ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్