AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్‌కప్ జట్టులో నో ప్లేస్.. ఆ ముగ్గురి కెరీర్ ఇక ముగిసినట్టే.. కుండబద్దలు కొట్టిన క్రికెట్ పెద్దన్న!

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఎలాంటి సంచలనాలు లేకుండా.. ఆసియా కప్‌కు ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్‌లోనే.. ప్రసిద్ద్ కృష్ణ, తిలక్ వర్మలను తప్పించి.. మిగిలిన 15 మంది సభ్యులను వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు.

వరల్డ్‌కప్ జట్టులో నో ప్లేస్.. ఆ ముగ్గురి కెరీర్ ఇక ముగిసినట్టే.. కుండబద్దలు కొట్టిన క్రికెట్ పెద్దన్న!
Team India
Ravi Kiran
|

Updated on: Sep 05, 2023 | 6:02 PM

Share

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఎలాంటి సంచలనాలు లేకుండా.. ఆసియా కప్‌కు ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్‌లోనే.. ప్రసిద్ద్ కృష్ణ, తిలక్ వర్మలను తప్పించి.. మిగిలిన 15 మంది సభ్యులను వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. చాలా జట్లు యువ ప్లేయర్లతో పాటు అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయగా.. బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం సీనియర్లపై ఎలాంటి ఆసక్తిని కనబరచలేదు. దీంతో చాలామంది ఫ్యాన్స్‌లో టీమిండియా గెలుస్తుందా.? లేదా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు టీమిండియా వెటరన్ ప్లేయర్స్ అయిన శిఖర్ ధావన్, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్‌లను పక్కనపెట్టేసింది బీసీసీఐ. వీరి నలుగురిని పక్కనపెట్టేయడంతో.. ఇక దాదాపుగా ఈ నలుగురు ఆటగాళ్ల కెరీర్ ముగిసినట్టేనని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఒకప్పుడు ఓపెనర్‌గా శిఖర్ ధావన్.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. కానీ ఇప్పుడు అతడికి చెక్ పెట్టేసింది బీసీసీఐ. ఆసియా కప్‌లో ధావన్‌కు చోటు దక్కుతుందని.. అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ఇక వరల్డ్‌కప్ జట్టులోనూ అతడికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం తమ దృష్టిలో రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లని.. ధావన్ ఒకప్పుడంటూ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గతంలోనే కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపుగా ధావన్ కెరీర్ ముగిసినట్టేనని తెలుస్తోంది. సాధారణంగా ఏ జట్టైనా లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్ కాంబినేషన్ కోసం చూస్తుంటారు జట్లు. టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఇంపార్టెంట్.. అలాగే ధావన్ ఎక్స్‌పీరియన్స్ కూడా అదనపు బలం. కానీ ఇవేమి పట్టించుకోలేదు బీసీసీఐ.

అశ్విన్, భువనేశ్వర్‌లు ఎక్కడ.?

స్వదేశంలో అశ్విన్, భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఆటగాళ్లు. ఇద్దరూ స్పెషలిస్ట్ బౌలర్లు కూడా. కుల్దీప్, అక్షర్ పటేల్ బదులుగా అశ్విన్ జట్టులో ఉంటే.. అనుభవంతో పాటు.. అవసరమైనప్పుడు వికెట్లు కూడా దక్కుతాయి. అలాగే భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌తో పాటు పవర్ ప్లే ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్ వేస్తాడు. వికెట్లు కూడా జట్టుకు అందిస్తాడు. అయితే ఇంతటి సీనియర్ బౌలర్‌‌లను పక్కనపెట్టడం భారత్‌కు ప్రతికూలమే.

చాహల్ సంగతేంటి.?

యుజ్వేంద్ర చాహల్ పరిస్థితి ఏంటి.? వరుసగా అన్ని ఐసీసీ టోర్నమెంట్లలోనూ చాహల్‌ను బీసీసీఐ పక్కనపెట్టేసింది. ఇండియా పిచ్‌లపై అతడు మ్యాచ్ విన్నర్. కానీ తుది జట్టులోకి మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. పోటీ ఎక్కువగా ఉండటంతో.. ఈ నలుగురు ఆటగాళ్ళకు ఇకపై టీమిండియా తలుపు తట్టడం కష్టమే అని అనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..