RX 100 Movie: బ్లాక్ బస్టర్ హిట్ ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?..

ఈ సినిమాతో అటు హీరోగా కార్తికేయకు.. ఇటు దర్శకుడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ముఖ్య కారణం మాత్రం హీరోయిన్ పాత్రే. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. ఓవైపు గ్లామర్ టచ్ ఇస్తూనే.. మరోవైపు హీరోయిన్ పాత్రను పూర్తిగా నెగిటివ్‏గా చూపించారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ ను పోషించారు పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతోనే తెలుగు తెరకు ఆమె కథానాయికగా పరిచయమయ్యారు.

RX 100 Movie: బ్లాక్ బస్టర్ హిట్ ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?..
Rx 100 Movie
Follow us

|

Updated on: Jul 16, 2023 | 9:27 AM

యంగ్ హీరో కార్తికేయ హీరోగా పరిచయమైన సినిమా ఆర్.ఎక్స్ 100. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయం సాధించింది. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది నిర్మాతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అటు హీరోగా కార్తికేయకు.. ఇటు దర్శకుడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ముఖ్య కారణం మాత్రం హీరోయిన్ పాత్రే. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. ఓవైపు గ్లామర్ టచ్ ఇస్తూనే.. మరోవైపు హీరోయిన్ పాత్రను పూర్తిగా నెగిటివ్‏గా చూపించారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ ను పోషించారు పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతోనే తెలుగు తెరకు ఆమె కథానాయికగా పరిచయమయ్యారు.

తొలి సినిమాలోనే గ్లామర్ లుక్స్.. ఇటు నెగిటివ్ రోల్ తో మెప్పించింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు ముందుగా అనుకున్నది పాయల్ ను కాదట. ఈ సినిమాకు నందిత శ్వేతను కథానాయికగా అనుకున్నారట డైరెక్టర్ అజయ్ భూపతి. కానీ నందిత ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట.

ఇవి కూడా చదవండి

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంది నందిత. ఇప్పటివరకు మితిమిరిన గ్లామర్ పాత్రలు చేయకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆర్.ఎక్స్ 100 చిత్రంలో గ్లామర్ షో చేయడానికి నందిత సుముఖంగా లేకపోవడంతో ఈ సినిమాను వదిలేసుకుందట. ఈ విషయాన్ని ఆమె హిడింబ సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.