Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ!
గోట్ ఇండియాల టూర్‌లో భాగంగా శనివారం ప్రపంచ ఫుడ్‌బాల్ లెజెండ్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ఫుడ్‌బాల్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. అయితే ఈ కాక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రానున్నట్టు తెలుస్తోంది.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, ఫుడ్‌బాల్ లెజెండ్ మెస్సీ మధ్య జరగనున్న ఫుడ్ బాల్ మ్యాచ్‌ను ఆయన వీక్షించనున్నారు. అర్జెంటీ ప్రముఖ క్రీడాకారుడు మెస్సీని కలవనున్నారు రాహుల్ గాంధీ. మెస్సీతో సీఎం రేవంత్ ఆటను తిలకించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్ నుమా ప్యాలెస్ కు విచ్చేస్తారు. అక్కడే బస చేసి రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ చూసేందుకు వస్తారు. రాత్రి 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉంటారు. మ్యాచ్ అనంతరం రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహిస్తున్న గోట్ ఇండియా టూర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తిరిగి రాత్రి 10:30 ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
ఇక నిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు అనెక్స్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటు చోరీపై ఢిల్లీలోనీ రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంపై చర్చించారు. ఓటు చోరీ జరుగుతున్న తీరు తెన్నులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ ఎన్డీఏ సర్కారు చేపడుతున్న వ్యతిరేక విధానాలపై ఎంపీలకు రాహుల్ గాంధీ దిశనిర్దేశం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




