AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. యాక్షన్ సీన్స్ షూటింగ్ కంప్లీట్..

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ. గత కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక గత రెండు వారాలుగా ఈమూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుంది.

Devara: దేవర నుంచి బిగ్ అప్డేట్.. యాక్షన్ సీన్స్ షూటింగ్ కంప్లీట్..
Ntr Devara
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2023 | 9:07 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారెజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో హైప్ ఏర్పడింది. దేవర చిత్రంలో తారక్.. మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ. గత కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక గత రెండు వారాలుగా ఈమూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా శనివారం యాక్షన్స్ సీన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాలు చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది.

ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించారు.ఈ షెడ్యూల్‍‏లోనే హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఇక దేవర కోసం కెన్నీ బేట్స్ వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ సైతం పిలిపించారు మేకర్స్. బేట్స్ నేతృత్వంలోపలు థ్రిల్లింగ్ సన్నివేశాలను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇందులో తారక్ మత్య్స కారుడిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంటే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల..
ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల..
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!