Mahesh Babu: మహేష్‌తో పోకిరి మిస్ అయిన హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం..
డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన టేకింగ్, డైలాగ్స్, హీరోయిజం అంటే యూత్‌లో సేపరెట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తన సినిమాల్లో హీరోలను పూరి చూపించే తీరు విభిన్నం. మహేష్, పూరి కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సెషనల్ హిట్ అయ్యాయి. అందులో పోకిరి ఒకటి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ఘన విజయం అందుకున్న మహేష్.. ఇప్పుడు జక్కన్న సినిమాకు తన లుక్స్ సైతం మార్చేశాడు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పోకిరి. డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మహేష్ ఫాలోయింగ్ కూడా మారిపోయింది. నిజానికి అంతకు ముందు వచ్చిన మహేష్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నిజం, నాని, అర్జున్, అతడు సినిమాలకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ అదే సమయంలో రిలీజ్ అయిన పోకిరి మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో మహేష్ బాబు యాక్టింగ్.. పూరిజగన్నాథ్ డైరెక్షన్, డైలాగ్స్, ట్విస్టులు సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ సినిమాతో అటు మాస్ హీరోగానూ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్.
ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా హీరోయిన్గా నటించి మెప్పించింది. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి ముందుగా అనుకున్న హీరోయిన్ ఇలియానా కాదట. అవును.. నిజానికి పోకిరి సినిమాకు ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట పూరి. ఇలాంటి మాస్ యాక్షన్ చిత్రాల్లో ముందుగా బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు డైనమిక్ డైరెక్టర్ పూరి. అందుకే పూరి ఎక్కువగా తన సినిమాల్లో బాలీవుడ్ భామలు ఉండేలా చూస్తారు.
ఈ క్రమంలోనే పోకిరి సినిమాకు కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ ను సెలక్ట్ చేశారట. ఆమె మరెవరో కాదు కంగనా రనౌత్. పోకిరి సినిమాలో ముందుగా కంగనా రనౌత్ ను హీరోయిన్ గా అనుకున్నారట దర్శకుడు పూరిజగన్నాథ్. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించినప్పుడు గ్యాంగ్ స్టార్ అనే సినిమా చేస్తుందట కంగనా. దీంతో పోకిరి సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ అయ్యానని.. కానీ ఇప్పటికీ పోకిరి సినిమాను మిస్ చేసుకున్నందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా అని తెలిపింది.
View this post on Instagram
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‌ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్‌తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
