ఇండస్ట్రీలోకి వచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
2001లో గజాల తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఇక ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
చాలా మంది హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకే పరిమితం అవుతుంటారు. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకుంటుంటారు. అలాంటి వారిలో నటి గజాల ఒకరు. తెలుగుతోపాటు కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. 2001లో గజాల తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జగపతి బాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఇక ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు సినిమాల్లో నటించింది. గజాల హీరోయిన్ గా చివరిగా జానకి వెడ్స్ శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో గెస్ట్ రోల్ చేసింది.
ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?
అయితే ఈ అమ్మడు 2002లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. మస్కట్లో జన్మించిన ఈ చిన్నది. జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె సహ నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గజాల బ్రతికి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అయితే గజాల ఆత్మహత్యా ప్రయత్ననికి ప్రేమ వ్యవహారమే కారణం అని అప్పటిలో వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి :ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
ఇక గజాల హిందీ టీవీ నటుడైన ఫైజల్ రజా ఖాన్‌ను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గజాల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.