Shankar Dada M.B.B.S: మెగాస్టార్‌తో శంకర్ దాదాలో స్టెప్పులేసిన ఈ కాంచనమాలా గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే
బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా మున్నాభాయ్ సినిమాను తెలుగులో శంకర్ దాదా గా రీమేక్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ యాక్టింగ్ , కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి హీరో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. మెగాస్టార్ సూపర్ హిట్ మూవీస్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఒకటి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా మున్నాభాయ్ సినిమాను తెలుగులో శంకర్ దాదా గా రీమేక్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ యాక్టింగ్ , కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు డైలాగ్స్ రాశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు శ్రీకాంత్ కూడా నటించాడు.
మెగాస్టార్ సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన బ్యూటీ గురించి తెలుసా.. శంకర్ దాదా సినిమాలో నా పేరు కంచన్ మాలా సాంగ్ లో నటించిన ముద్దుగుమ్మ పేరు గౌహర్ ఖాన్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 2002లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది ఈ బ్యూటీ.
పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. అలాగే వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. అంతే కాదు టెలివిజన్ షోలోనూ నటించింది. తెలుగులో ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాలో నటించింది. హిందీలోనే ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రోజూ తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
గౌహర్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
గౌహర్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




