Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

తెలుగు సినీ ప్రియులకు మనసుకు దగ్గరైన ప్రేమకథలు ఎక్కువే. ఒకప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎక్కువే. ఇప్పటికీ ఆ సినిమాలు వస్తుంటే టీవీలకు అతుక్కుపోతుంటారు. అందులో సంపంగి ఒకటి. 90’s కుర్రాళ్లకు ఇష్టమైన హార్ట్ ఫేవరేట్ మూవీ ఇది. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్.

ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Sampangi Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2025 | 10:04 AM

టాలీవుడ్ లో వచ్చిన అందమైన ప్రేమకథ చిత్రాల్లో ఎప్పటి గుర్తుండిపోయే సినిమా సంపంగి. 2001లో వచ్చిన సంపంగి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఒక హిందూ అబ్బాయి. ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ కు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఎంతో మంది వింటూ ఉంటారు. ఇక ఈ సినిమాకు సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోగా దీపక్ నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు కంచి కౌల్. సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా..?

కంచి కౌల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు టెలివిజన్ షోలోనూ నటించింది. ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి. ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాల్లో నటించింది. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది.

2005లో ఏక్ లడ్కీ అంజనీ సి అనే టీవీషోలో నటించింది. ఇదిలా ఉంటే కంచి కౌల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది . వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది యాక్టివ్ గా ఉంటుంది. అడపాదడపా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by kanchikaul (@kanchikaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి