Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ఆ విషయంలో బాధగా ఉంది.. అదొక చేదు వార్త అంటున్న పూజా హెగ్డే..

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

Pooja Hegde: ఆ విషయంలో బాధగా ఉంది.. అదొక చేదు వార్త అంటున్న పూజా హెగ్డే..
Pooja Hegde
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2025 | 8:39 AM

అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్.. భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చుపిస్తాయని అనుకుంటున్నా.. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది. అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. మేము నటులం ఫ్లాప్ లను కూడా స్వీకరించాలి. బీస్ట్‌ సినిమా తర్వాత ఇప్పుడు జన నాయగన్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కానీ ఇది విజయ్ చివరిచిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది. నా దృష్టిలో ఇదొక చేదు వార్త. ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్‌ సినిమాల్ని ఇష్టపడతారు. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో