హేయ్..! మళ్ళీరావా పాప నువ్వేనా ఇది.. హీరోయిన్స్ కుళ్ళుకునేలా మారిపోయిందిగా..
చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక పైన కనిపిస్తున్న చిన్నది గుర్తుందా.? సుమంత్ హీరోగా నటించిన మళ్ళీ రావా సినిమాతో ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు.

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ ను కూడా బీట్ చేసే అందాలతో అదరగొడుతున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. మళ్ళీ రావా సినిమా గుర్తుందా.? సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సుమంత్ హిట్ అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటి గుర్తుందా.? సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మడు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది. అంత బాగుంది ఆ బ్యూటీ.
మళ్లీ రావా సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రీతీ అస్రానీ. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్స్ కూడా ఉలిక్కి పడేలా మారింది. మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించింది. గుజరాత్‌కి చెందిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.
ఇక 2017లో మళ్లీ రావా సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించిన ఈ భామ.. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. సుమంత్ అశ్విన్ నటించిన హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారికకు చెల్లిగా, గోపీచంద్ సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అందంలో స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోదు. ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రీతీ ఆస్రానీ. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది. సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇక ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.