AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule : పుష్ప 3లో విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న ఏమన్నదంటే

పుష్ప 2 థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు రోజుల్లోనే 1000కోట్లు వసూల్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1067 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

Pushpa 2 The Rule : పుష్ప 3లో విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న ఏమన్నదంటే
Rashmika, Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2024 | 8:01 PM

Share

అల్లు అర్జు నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం 5వ తేదీన థియేటర్లలో విడుదలై దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. కేవలం ఆరురోజుల్లోనే రూ. 1000కోట్లు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప2. ఇక ఇప్పుడు 9 రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్ స్టేటస్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.  పుష్ప 1 కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 సంచలన విజయం సాధించింది. పుష్ప: ది రైజ్ అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, సునీల్ నటించారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక పుష్ప 2 సినిమా తొలి రోజే భారీ ఓపినింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి భాగం కంటే పుష్ప 2లో యాక్షన్స్ సీన్స్ భారీగా ఉండేలా ప్లాన్ చేశాడు దర్శకుడు సుకుమార్.

మొదటి భాగంలో కూలీగా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగంలో పెద్ద స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా కనిపించాడు. సినిమా థియేటర్లలో అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కింది. దాదాపు 3 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తుంది. ఇదిలా ఉంటే పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. సుకుమార్ కూడా పుష్ప 3 పై క్రేజీ కామెంట్స్ చేశారు.

అయితే పుష్ప 3లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో సుకుమార్ , విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇంతవరకు దాని గురించి ఊసే లేదు. అయితే ఇప్పుడు పుష్ప 3లో విజయ్ నటిస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై హీరోయిన్ రష్మిక మందన్న స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. మీకే కాదు నాకు కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి విషయంలో సస్పెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరి వరకు ఏ విషయాన్నీ బయట పెట్టారు. ‘పుష్ప 2’కు విషయాలు కూడా సెట్ లో  చెప్పేవారు. సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేనూ ఆశ్చర్యపోయా అని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..