‘ఉప్పెన’ సినిమాలో మొదట కృతిని హీరోయిన్‌గా అనుకోలేదట.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు..
"ఉప్పెన" సినిమా ఓ పెను ఉప్పెనలా తెలుగు రాష్ట్రాలను తాకింది. జడివాన లాగా ప్రేక్షకులను తడిపి ఆనందిపంచేసింది. వరదలా.. ప్రొడ్యూసర్లను లాభాల్లో ముంచి తేల్చింది.

krithi shetty: “ఉప్పెన” సినిమా ఓ పెను ఉప్పెనలా తెలుగు రాష్ట్రాలను తాకింది. జడివాన లాగా ప్రేక్షకులను తడిపి ఆనందిపంచేసింది. వరదలా.. ప్రొడ్యూసర్లను లాభాల్లో ముంచి తేల్చింది. కళకళలాడే చెరవులా కృతి, వైష్ణవ్ కు అవకాలను తెచ్చిపెట్టింది. అయితే ఈసినిమాలో మొదట కృతిని హీరోయిన్‌గా అనుకోలేదట డైరెక్టర్ బుచ్చిబాబు సాన .. అవును వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం నిజంగా నిజం.. తనే ఓ ఇంటర్య్వూలో చెప్పినంత నిజం. సుకుమార్ శిష్యడు బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్టైన సినిమా.. ఉప్పెన. అయితే ఈ సినిమాలో మొదట కృతిషెట్టిని హీరోయిన్‌గా అనుకోలేద డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ అమ్మాయికి బదులు… షూటింగ్కి కొన్ని రోజుల ముందు మనీషా అనే తెలుగమ్మాయిని ఈసినిమాలో హీరోయిన్గా అనుకున్నారట.
అయితే ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అవడానికి కొన్నిరోజుల ముందు సోషల్‌మీడియాలో కృతిశెట్టి ఫొటోలు చూసిన దర్శకుడు బుచ్చి బాబు… “ఉప్పెన” లో మనీషా కంటే కృతిశెట్టి అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. ఇక వెంటనే తన గురువు సుకుమార్‌ను కలిసి హీరోయిన్ విషయంలో తను అనుకున్నది చెప్పేశారట. దానికి సుకుమార్ “నీ సినిమా.. నీ మనసు ఏది చెబితే అది విను” అని సమాధానం చెప్పడంతో…. వెంటనే కృతికి కబురు పంపి.. టెస్ట్ షూట్ చేసేశారట ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఆ షూట్ లో కృతి ఉప్పెనకు పర్ఫెక్ట్ హీరోయిన్ గా అనిపించడంతో… కృతిని లాక్ చేశారట. అలా అనుకోకుండా ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్‌గా లాక్ అయి… టాలీవుడ్లో మంచి బ్రేక్ అదుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
మరిన్ని ఇక్కడ చదవండి :