AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3 Movie: ఏంటీ.. ఈ అమ్మాయి డాక్టరా.. ? హిట్ 3లో రఫ్పాడించిన ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే..

న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గతంలో సూపర్ హిట్స్ అయిన హిట్ 1, 2 చిత్రాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. నాని, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

HIT 3 Movie: ఏంటీ.. ఈ అమ్మాయి డాక్టరా.. ? హిట్ 3లో రఫ్పాడించిన ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే..
Komalee Prasad
Follow us
Rajitha Chanti

|

Updated on: May 08, 2025 | 1:07 PM

తెలుగు సినీరంగంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు కొందరు హీరోహీరోయిన్స్ వైద్యులుగా వర్క్ చేశారు. మరికొందరు నటనపై ఆసక్తితో డాక్టర్ చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లో కొనసాగుతున్నారు. శ్రీలీల, సాయి పల్లవి, కామాక్షి భాస్కర్ల, మీనాక్షి చౌదరి వంటి స్టార్స్ డాక్టర్స్. కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులర్ అవుతుంది. హీరోయిన్ గా… క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. ఆమె మరెవరో కాదు.. కోమలీ ప్రసాద్.

హిట్ 2లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు హిట్ 3లోనూ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేసింది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న కోమలీ ప్రసాద్.. తన గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ.. “నేను డెంటిస్ట్ ను.. డాక్టర్ చదువు పూర్తి చేసి డెంటిస్ట్ గా పనిచేశాను. సినిమాల్లోకి వస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నాకే ఏదైనా చేయమన్నారు. చేతిలో డిగ్రీ ఉంటే సేఫ్గా ఉంటుంది అని చెప్పారు. అందుకే ఇండస్ట్రీలోకి లేట్ గా వచ్చాను.

న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే నేను సీత దేవి సినిమా ఛాన్స్ వచ్చింది. నా సెకండ్ సినిమా డైరెక్టర్ అందులో హీరో. నటించమని అడగడంతో నా మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి సినిమాల్లోకి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది. కోమలీ ప్రసాద్ క్యాసికల్ డ్యానర్. తెలుగులో నెపోలియన్, హిట్, టచ్ మీ నాట్, లూజర్ వంటి చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..