ఇదెక్కడి అరాచకం మావ.. ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట.. ఏకంగా నాలుగు నిముషాలు
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాంటి జోనర్ సినిమా అయినా సరే లిప్ లాక్స్ ఉండాల్సిందే. ప్రేక్షకులు కూడా లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ కు ఎక్కువగా అలవాటు పడ్డారు. వాటిలో పెద్దగా తప్పు కనిపించడం లేదు.. అయితే ఇండియన్ సినిమాల్లో తొలి లిప్ లాక్ ఉన్న సినిమా ఎదో తెలుసా.?

ఇప్పుడొస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఎలాంటి సినిమా అయినా సరే లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. హీరోయిన్స్ కూడా లిప్ లాక్ సీన్స్ కు వెనకాడటం లేదు. యాక్షన్ సినిమా అయినా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అయినా.. మాస్ సినిమా అయినా.. రొమాంటిక్ సీన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇండియన్ సినిమాలో తొలి లిప్ లాక్ సీన్ ఏ సినిమాలో ఉన్నదో తెలుసా.? సినిమాలో ఎప్పుడు తొలి లిప్ లాక్ సీన్ ఎప్పుడు తీసుకొచ్చారో.? ఏ సినిమాలోనో.? మీకు తెలుసా.? అది కూడా ఇండియన్ సినిమాలో లాంగెస్ట్ కిస్ సీన్ ఇది. ఏకంగా నాలుగు నిముషాలు లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..
ఇండియన్ సినిమాలోనే తొలి లిప్ లాక్ సీన్ ఉన్న సినిమా ఏదంటే.. ఇండియన్ సినిమాలో తొలి లిప్ లాక్ సీన్ 1933లో విడుదలైన “కర్మ” సినిమాలోది. ఈ సినిమాలో నటి దేవికా రాణి, హిమాన్షు రాయ్ కలిసి నటించారు. కర్మ సినిమాలో దేవికా రాణి, హిమాన్షు రాయ్ మధ్య జరిగే సన్నివేశంలో ఈ సన్నివేశం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఈ సినిమా లో ఈ లిప్ లాక్ సీన్ దాదాపు నాలుగు నిమిషాల పాటు సాగిందని చెబుతారు. ఇది అప్పట్లో చాలా వివాదాస్పదంగా కూడా మారింది.
“కర్మ” అనేది ఒక హిందీ-ఇంగ్లీష్ ద్విభాషా చిత్రం, ఈ సినిమాను హిమాన్షు రాయ్ నిర్మించారు, అతను దేవికా రాణి భర్త కూడా. ఇక ఈ సినిమా తర్వాత సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఇక దేవికా రాణి ఇండియాలో మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్. అప్పట్లోనే ఆమె చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది. ఆసమయంలో ఆమె పై చాలా విమర్శలు వచ్చాయి. ఆమె ఇమేజ్‌పై ప్రభావం చూపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.