ఏం పిల్లారా బాబు.. మైండ్‌లో నుంచి పోవడంలేదు..! చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చాలా మంది నటీనటుడు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. చాలా మంది ముందు సోషల్ మీడియాలో వీడియోలు చేసి అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

సినిమా ఇండస్ట్రీలో కురాళ్ళ కవ్వించే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అందచందాలతో పాటు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కుర్రహీరోయిన్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే కానీ తన అందంతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడ తగ్గకుండా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టరా.? చేసింది 5 సినిమాలు అందులో రెండే రెండు హిట్స్ .. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆమె ఎవరంటే..
పై ఫొటోలో వయ్యారంగా కనిపిస్తున్న ఆ బ్యూటీ ఎవరో కాదు.. యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి. చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాతో వచ్చిన క్రేజ్ తో హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకున్నారు. వారిలో రమ్య పసుపులేటి. సినిమాల కంటే ముందు టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంది రమ్య. ఆతర్వాత హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది. రమ్య పసుపులేటి 2018లో విడుదలైన “హుషారు” అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం యువతను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకుమంచి గుర్తింపు లభించింది.
ఈ సినిమా తర్వాత ఆమె “మైల్స్ ఆఫ్ లవ్”, “ఫస్ట్ ర్యాంక్ రాజు” వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, “బీఎఫ్‌ఎఫ్” (బెస్ట్ ఫ్లాట్‌మేట్ ఫరెవర్) అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆమె తన నటనా ప్రతిభను చూపించింది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటుంది. తాజాగా మ్యాడ్ 2 సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా రమ్య కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇన్ స్టాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.
View this post on Instagram
రమ్య పసుపులేటి ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.