Rashmika : అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.. రష్మిక ఎమోషనల్
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. రీసెంట్ గా పుష్ప 2, ఛావా సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. అలాగే ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రష్మిక డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డేట్స్ అడ్జెస్ట్ కాక కొన్ని సినిమాలు కూడా మిస్ చేసుకుంది ఈ భామ. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు జోడీగా సికిందర్ అనే సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే రష్మీక మందన్న గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, సుమన్ మందన్న, మదన్ మందన్న. రష్మిక తన బాల్యంలో తన కుటుంబం అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బంది పడిన సమయాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. గతంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఆర్థిక సమస్యల కారణంగా తన తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని. అద్దె ఇల్లులో నివసిస్తూ, కొన్నిసార్లు ఆర్థిక ఒడిదొడుకుల వల్ల సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టమైన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రష్మిక తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించి, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
2016లో “కిరిక్ పార్టి” అనే కన్నడ చిత్రంతో నటిగా తొలి అడుగు వేసిన రష్మిక, క్రమంగా తన ప్రతిభతో సౌత్ సినిమా పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగింది. రష్మిక తన విజయం వెనుక తన తల్లిదండ్రుల త్యాగాలు, ప్రోత్సాహం ఉన్నాయని తరచూ చెప్తూ ఉంటుంది. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, ఆమె చదువుకు, కలలకు మద్దతుగా నిలిచారని తెలిపింది. అలాగే గతంలో తన తండ్రి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌లలో కూడా పంచుకుంది. ఆయన ప్రేమ, మద్దతు తన జీవితంలో ఎంత ముఖ్యమో వివరించింది. రష్మిక మందన్న తన తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకుంటూ, వారి స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి చేరానని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.