Gopichand: ఏంటీ.. గోపిచంద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా చేశాడా.! ఏ హీరో సినిమాలోనంటే..

నిజానికి గోపీచంద్ హీరోగా సినీ కెరీర్ మొదలు పెట్టాడు. తొలివలపు సినిమాతో హీరోగా మారాడు. తరువాత జయం, నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు.

Gopichand: ఏంటీ.. గోపిచంద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా చేశాడా.! ఏ హీరో సినిమాలోనంటే..
Gopichand
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2024 | 8:40 AM

యాక్షన్ హీరో గోపీచంద్ వరుస ఫ్లాప్స్ తర్వాత రీసెంట్‌గా విశ్వం సినిమాతో హిట్ అందుకున్నాడు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిజానికి గోపీచంద్ హీరోగా సినీ కెరీర్ మొదలు పెట్టాడు. తొలివలపు సినిమాతో హీరోగా మారాడు. తరువాత జయం, నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. విలన్ గా అద్భుతంగా నటించిన గోపీచంద్. యజ్ఞం సినిమాతో హీరోగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. యజ్ఞం అనే యాక్షన్ సినిమాతో హిట్ అందుకున్నాడు. రణం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత గోపిచంద్ నటించిన సినిమాలు కొన్ని నిరాశపరిచాయి.

ఇది కూడా చదవండి : Tollywood : 49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

గౌతం నంద సినిమా తర్వాత గోపీచంద్ హిట్స్ అందుకోలేకపోయాడు. జిల్ సినిమా పర్లేదు అనిపించుకుంది. సౌఖ్యం, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్, పంతం, చాణక్య,  సీటీమార్, పక్కా కమర్షియల్,  రామబాణం, భీమా వంటి సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతంగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విశ్వం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.

ఇది కూడా చదవండి : Jyothika: నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావ్.. టాలీవుడ్ హీరోయిన్ను ఆకాశానికి ఎత్తేసిన జ్యోతిక

ఇదిలా ఉంటే గోపీచంద్ సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. టి. కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. అయితే గోపీచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేశాడు. గోపిచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా దేశంలో దొంగలు పడ్డారు. ఈ మూవీలో సుమన్, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు.ఇదే  సినిమాలో గోపీచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ సినిమా తర్వాత గోపీచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేస్తాడని అందరూ అనుకున్నారు. గోపీచంద్ తండ్రి కూడా రేపటి పౌరులు సినిమాలో కూడా గోపీచంద్ ని నటింపచేయాలని అనుకున్నాడట. కానీ చదువుకు ఆటంకం కలగకూడదని తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. అలా గోపీచంద్ ఒకే ఒక్క సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

ఇది కూడా చదవండి : ఏవండోయ్ ఇది చూశారా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈవిడ ఎవరో కనిపెట్టారా.? ఫేమస్ సెలబ్రెటీ సతీమణి ఆమె

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!