AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవికి లవర్‌గా, తల్లిగా, భార్యగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమెవరో తెల్సా

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి తన కెరీర్‌లో సుమారు 150కిపైగా చిత్రాల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి నేటితరం నటీమణుల వరకు అందరితోనూ ఆడిపాడారు చిరంజీవి.

చిరంజీవికి లవర్‌గా, తల్లిగా, భార్యగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమెవరో తెల్సా
Chiranjeevi
Ravi Kiran
|

Updated on: Oct 18, 2024 | 12:52 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో మన బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మెగాస్టార్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్‌లో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి.. ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఒకప్పటి హీరోయిన్స్ మాత్రమే కాదు.. ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు సైతం చిరుతో ఆడిపాడారు. అయితే వీరిలో ఒక్క హీరోయిన్ చిరంజీవికి అక్కగా, లవర్‌గా, తల్లిగా, భార్యగా.. ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు సీనియర్ నటి సుజాత.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 300కిపైగా చిత్రాల్లో నటించిన నటి సుజాత.. మొదటిగా హీరోయిన్‌గా ఆ తర్వాత అక్క, వదిన, అమ్మ వంటి పాత్రల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ప్రేమ తరంగాలు’ మూవీలో చిరంజీవికి లవర్‌గా నటించి మెప్పించింది సుజాత. ఇక ఈ సినిమా చివర్లో వీరికి వివాహం జరుగుతుంది. ఇలా సుజాత చిరంజీవికి భార్యగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 1982లో ‘సీతాదేవి’ అనే మూవీలో సుజాత చిరంజీవికి చెల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఇక 1995లో ‘బిగ్‌బాస్’ మూవీలో సుజాత చిరంజీవికి తల్లిగా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. కాగా, ఇప్పటివరకు చిరంజీవికి తల్లిగా, లవర్‌గా, భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ సుజాత కావడం విశేషం. సుజాత తన చివరి రోజుల వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇక ఆమె 2011, ఏప్రిల్ 6న కన్నుమూశారు.

ఇది చదవండి: ఓర్నీ.! మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్టు ఏంటి ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా..

ఇవి కూడా చదవండి
Tollywood

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్