Mukesh Rishi: ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన కుమారుడు కూడా క్రేజీ హీరోనే.. ఫొటోస్ ఇదిగో
ముఖేష్ రిషి.. తెలుగులో వందలాది సినిమాల్లో నటించిన ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగుతో ముఖేష్ రుషి అంటే నరసింహ నాయుడు, ఇంద్ర సినిమాలే గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు అతని కుమారుడు కూడా సినిమాల్లో సత్తా చాటుతున్నాడు.

1994లో గాంఢీవం సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ముఖేష్ రిషి. అంతకు ముందు పలు హిందీ సినిమాల్లో నటించాడు. మనోహరం, నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు, సింహాద్రి, సీతయ్య, నేనున్నాను, బన్నీ, పౌర్ణమి, జల్సా, ఆర్య 2, నమో వెంకటేషా, శంబో శివ శంబో, డార్లింగ్, బృందావనం, బాద్షా, శ్రీమంతుడు, లౌక్యం, మహర్షి, సైరా, వకీల్ సాబ్, సైంధవ్, బడ్డీ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ముఖేష్. విలన్ గా, సహాయక నటుడి పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యారు. ఒక్క తెలుగులోనే కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, తమిళ్, భోజ్ పురి, పంజాబీ సినిమాల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్ కు చేరవయ్యాడీ సీనియర్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే ముఖేష్ రిషి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ముఖేష్ రిషి భార్య కేష్ని రిషి. ఫిజియన్ సంతతికి చెందిన భారతీయ మహిళైన కేష్నిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ టాలీవుడ్ విలన్.
వివాహం చేసుకున్న వెంటనే కేష్ని, ముఖేష్ రిషి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయారు. అక్కడ దాదాపు ఏడు సంవత్సరాలు నివసించారు. ఆ తర్వాత మళ్లీ ముంబైకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఇదే సమయంలో మోడల్ గా కెరీర్ ఆరంభించిన ముఖేష్ క్రమంగా సినిమాల్లోనూ బిజీ అయిపోయాడు.
భార్య, కుమారుడితో నటుడు ముఖేష్ రిషి..
View this post on Instagram
ఇక తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు ముఖేష్ రిషి కుమారుడు రాఘవ రిషి. 2019లో ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రాఘవ రిషి. అలాగే ‘నిదర్’ అనే పంజాబీ సినిమాలోనూ నటించాడు. ఇందులో ముఖేష్ రిషి కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు రాఘవ. ఇక సోషల్ మీడియాలో ముఖేష్ రిషికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. చూడ్డానికి అచ్చం తండ్రిలాగే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నిడర్ సినిమాలో తండ్రితో కలిసి రాఘవ రిషి..
View this post on Instagram
జై మా కాళి టెంపుల్ లో ముఖేష్ రిషి ఫ్యామిలీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




