AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఇద్దరు స్టార్ హీరోలతో లవ్, బ్రేకప్.. దర్శకుడితో పెళ్లి.. 20 ఏళ్లుగా తగ్గని డిమాండ్..

దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు అగ్ర కథానాయికగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కళ్లు తిరిగే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.

Actress : ఇద్దరు స్టార్ హీరోలతో లవ్, బ్రేకప్.. దర్శకుడితో పెళ్లి.. 20 ఏళ్లుగా తగ్గని డిమాండ్..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2025 | 7:42 AM

Share

సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాప్ హీరోలకే పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం చాలా కాలంగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో టాప్ హీరోలతో స్కీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమా చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈరోజు ఆమె పుట్టినరోజు (నవంబర్ 18). ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏ మాత్రం తగ్గని డిమాండ్ ఆమెది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. హీరోయిన్ నయనతార.

దక్షిణ భారత దేశంలో నయనతార అత్యంత ధనవంతులలో ఒకరు. ఆమె కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉంది. వెయ్యి కోట్ల చిత్రాలలో కూడా నటించింది. ఆమె 41వ పుట్టినరోజు సందర్భంగా, ఆమె గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. నయనతార నవంబర్ 18, 1984న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె గతంలో క్రైస్తవురాలు. మోడల్, యాంకర్‌గా పనిచేసిన నయనతార 19 సంవత్సరాల వయసులో మలయాళ చిత్రంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

2003లో మనసునక్కరే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2005లో చంద్రముఖి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరో శింబుతో ప్రేమలో పడింది. కానీ కొన్నాళ్లకే ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం నయన్ హిందూ మతంలోకి మారింది. కానీ అనుహ్యంగా వీరు విడిపోయారు. తరువాత నయనతార 2022లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కవలలు ఉన్నారు. నయనతార విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఆమె తన కుటుంబంతో కలిసి చెన్నైలోని ₹100 కోట్ల విలువైన 4 BHK ఇంట్లో నివసిస్తుంది. ఆమెకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఆమెకు BMW సిరీస్ 7, టయోటా ఇన్నోవా క్రిస్టా, BMW 5 సిరీస్, మెర్సిడెస్ GLS 350 D, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి కార్లు కూడా ఉన్నాయి. నివేదికల ప్రకారం నయనతార ఆస్తుల విలువ రూ. 200 కోట్లు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

Follow Us