AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah : మిల్కీబ్యూటీ రేంజ్ మాములుగా లేదుగా.. లగ్జరీ ఇళ్లు.. కోట్లలో బ్రాండ్ డీల్.. తమన్నా ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు స్పెషల్ పాటలతో అలరిస్తుంది. ముఖ్యంగా హిందీలో ఎక్కువగా ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఆస్తులు, కార్ కలెక్షన్ వివరాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Tamannaah : మిల్కీబ్యూటీ రేంజ్ మాములుగా లేదుగా.. లగ్జరీ ఇళ్లు.. కోట్లలో బ్రాండ్ డీల్.. తమన్నా ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..
Tamannaah Bhatia (6)
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2025 | 6:00 PM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళం భాషలలో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే గ్లామర్ బ్యూటీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఓటీటీల్లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. అలాగే స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి. గతేడాది వరుసగా సికందర్ కా ముఖద్దర్, ఆఖ్రీ సచ్, అరణ్మనై 4 వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో సక్సెస్ అందుకుంది. అలాగే ఆజ్ కీ రాత్ అంటూ స్పెషల్ గ్లామర్ పాటలతో రచ్చ చేసింది. అలాగే సల్మాన్ ఖాన్‌తో కలిసి దబాంగ్ టూర్‌లో ఆమె అద్భుతమైన ఉనికిని జతచేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ మంచి స్పెషల్ సాంగ్ ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమన్నా ఆస్తులు, సంపాదన గురించి ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

నివేదికల ప్రకారం తమన్నా ఆస్తుల విలువ 2023లో రూ.111 కోట్లు ఉండగా.. 2024లో రూ.120 కోట్లకు చేరుకుంది. కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు రూ.10 కోట్లు పెరిగింది. ఈ బ్యూటీకి ముంబైలోని వెర్సోవాలో ఒక ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నట్లు టాక్. ప్రాప్‌స్టాక్ డేటా ప్రకారం అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలాలో రూ. 7.84 కోట్ల విలువైన మూడు లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను ఉంది.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

తమన్నా కార్ కలెక్షన్.. తమన్నా దగ్గర BMW 320i (రూ. 43.50 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ GLE (రూ. 1.02 కోట్లు), మిత్సుబిషి పజెరో స్పోర్ట్ (రూ. 29.96 లక్షలు), ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ (రూ. 75.59 లక్షలు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే తమన్నా ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. స్కిన్, బ్యూటీ, కాస్మోటిక్స్ వంటి ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. తమన్నా గత సంవత్సరం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు 4 కోట్లు వసూలు చేస్తుంది. తమన్నా భాటియా కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు; ఆమె ఒక బ్రాండ్, వ్యాపారవేత్త.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..