Shreya Ghoshal : బాబోయ్.. బ్యాగ్రౌండ్ పెద్దదే.. సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలిస్తే షాకే..

భారతీయ సినీపరిశ్రమలోనే టాప్ సింగర్స్‏లో శ్రేయా ఘోషల్ ఘోషల్ ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపిస్తున్నారు. ఇప్పటికీ ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాళీ, మరాఠీ, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ పాటలతో శ్రోతల హృదయాలను గెలుచుకుంది శ్రేయా ఘోషల్. తాజాగా ఆమె భర్త గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Shreya Ghoshal : బాబోయ్.. బ్యాగ్రౌండ్ పెద్దదే.. సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలిస్తే షాకే..
Shreya Ghoshal Husband Shil

Updated on: Apr 15, 2025 | 4:54 PM

శ్రేయ ఘోషల్ భారతదేశపు నంబర్ వన్ గాయని. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో వందలాది సాంగ్స్ ఆలపించారు. అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సినీరంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న గాయని. భారతదేశంలోని దాదాపు అన్ని భాషలలో సాంగ్స్ పాడింది. అంతేకాకుండా చూడచక్కని రూపం.. సున్నితమైన మనస్తత్వం ఆమెకు మరింత మంది అభిమానులను తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళం భాషలలో ఆమె పాడిన ఎన్నో పాటలు మెస్మరైజ్ చేస్తుంటాయి. ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో పాటలు పాడుతూ యాక్టివ్ గా ఉంది. తాజాగా ఆమె భర్త గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. శ్రేయా ఘోషల్ భర్త అసలు ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. కానీ వ్యాపారరంగంలో మాత్రం అతడు కీలక పదవిలో ఉన్నారు.

శ్రేయా ఘోషల్ భర్త పేరు శైలాధిత్య ముఖోపాధ్యాయ. అతను చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సుపరిచితమైన యాప్ అయిన ట్రూకాలర్‌కు గ్లోబల్ CEO. 2009లో స్థాపించబడిన ట్రూకాలర్ అనే కంపెనీలో 2022లో చేరిన శైలాధిత్య ముఖోపాధ్యాయ తక్కువ సమయంలోనే ఆ కంపెనీ గ్లోబల్ సీఈఓ అయ్యారు. ఈ సంస్థ వార్షిక ఆదాయం 1660 కోట్లకు పైగా ఉంది. ఇందులో ఎక్కువ భాగం భారతదేశం నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. శైలాధిత్య అంతకు ముందు అంతర్జాతీయ కంపెనీలలో కీలక పదవులలో ఉన్నారు. అతడికి మొబైల్ యాప్, సాఫ్ట్ వేర్ నిర్వాహణలో ఎంతో నైపుణ్యం ఉంది. గతంలో క్లీవర్ ట్యాప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు, మరికొన్ని సంస్థలకు అధ్యక్షుడిగా , ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అతను హిప్‌కాస్క్ అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించాడు. ఇది వైన్ పరిశ్రమకు సంబంధించిన యాప్. ఆ తర్వాత, యువ వ్యవస్థాపకులకు సహాయం చేయడానికి పాయింట్‌షెల్ఫ్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

శ్రేయా ఘోషల్, శైలాధిత్య మంచి స్నేహితులు. వీరిద్దరి దాదాపు 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో ఒక బాబు జన్మించాడు. 20 ఏళ్లుగా శ్రేయా ఘోషల్ సినీరంగంలో ఎన్నో పాటలు పాడుతున్నారు.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?