Nani 30: హీరో నాని కూతురు చాలా హుషారు.. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా..

ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గురువారం చిత్రయూనిట్ ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే గ్లింప్స్ కూడా మేకర్స్ షేర్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఇందులో నాని కూతురిగా బేబీ కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాతో కైరా తెలుగు తెరకు బాలనటిగా పరిచయం కాబోతుంది.

Nani 30: హీరో నాని కూతురు చాలా హుషారు.. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2023 | 9:41 PM

ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఆయన తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా సినీపరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఇందులో నాని జోడిగా సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గురువారం చిత్రయూనిట్ ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే గ్లింప్స్ కూడా మేకర్స్ షేర్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఇందులో నాని కూతురిగా బేబీ కైరా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాతో కైరా తెలుగు తెరకు బాలనటిగా పరిచయం కాబోతుంది.

బేబి కైరా.. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ ఏడేళ్ల చిన్నారికి భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ నెట్టింట చాలా హుషారుగా సందడి చేస్తుంటుంది. తన అక్క మైరా ఖన్నాతో కలిసి రీల్స్ చేస్తూ అల్లరి చేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఇమిటేట్ చేస్తూ ఫేమస్ అయ్యింది. ఈ చిన్నారి ఇన్ స్టా ఆమె తల్లి శివానీ జోషి ఖన్నా మ్యానేజ్ చేస్తుంటారు. కైరా ఇన్ స్టాలో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ సెలబ్రెటీస్ సిద్ధార్థ్ మల్హోత్రా, అలియ్ భట్ వంటి స్టార్లను కలిసి వారితో సరదాగా రీల్స్ చేసింది. హీరోయిన్స్ చెప్పే డైలాగ్స్ చెబుతూ… అందుకు తగినట్టుగా హావభావాలను పలికిస్తుంది. కైరా చేసే ప్రతి రీల్ క్షణాల్లో నెట్టింట వైరలవుతుంది. ఇక ఇప్పుడు నాని సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిన్నారి. మరీ ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని మూవీస్ చేసే అవకాశాలు లేకపోలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.