విశ్వంభర ఏమైంది గురూ.! బాలయ్య కోసం అదిరిపోయే కథ రెడీ అంటున్న చిరు డైరెక్టర్..
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని తెలుస్తుంది.

బింబిసార సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు వశిష్ట.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత ఈ ఫాంటసీ మూవీతో కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక బింబిసార తర్వాత దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ సినిమా ఈ సినిమా షూటింగ్ లెట్ అవుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ తో పాటే చిరంజీవి అనిల్ రావిపూడితో సినిమా కూడా చేశారు.
విశ్వంభర కంటే ముందే అనిల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలైంది. భారీ హిట్ కూడా అయ్యింది. అయినా కూడా విశ్వంభర సినిమా అప్డేట్ మాత్రం లేదు. దాంతో ఈ సినిమా పై అభిమానుల్లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి విశ్వంభర నుంచి విడుదలైన టీజర్ పై విమర్శలు వచ్చాయి, గ్రాఫిక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే మొన్నామధ్య వశిష్ట ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వశిష్ట మాట్లాడుతూ.. బింబిసార చిత్రం విజయం సాధించిన తర్వాత బాలకృష్ణ కోసం ఒక ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు తెలిపాడు. ఈ కథను బాలయ్య గారికి వివరించగా, ఆయనకు అది ఎంతో నచ్చిందనితెలిపాడు.
అయితే, కొన్ని అవాంతరాలు, ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ వంటి కారణాల వల్ల, ఈ చిత్రం నిర్మాణం కొద్దికాలం వాయిదా పడే అవకాశం ఉందని బాలకృష్ణ చెప్పారట. ఈ క్రమంలో నే ఒక విభిన్నమైన కథా పాయింట్ చరణ్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారి వద్దకు చేరిందని తెలిపారు. అయితే బాలకృష్ణ గారికి చెప్పిన కథ గురించి మాట్లాడుతూ.. అది కేవలం ఫాంటసీ చిత్రం కాదని , యాక్షన్ కూడా ఉంటుందని వశిష్ట తెలిపాడు. బాలకృష్ణ ఇమేజ్‌కు, ఆయన అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్, వైలెన్స్ అంశాలతో కూడిన ఒక ప్రత్యేకమైన మ్యాజికల్ ఫిల్మ్ అని, అది బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఒక విభిన్నమైన జోనర్‌గా నిలుస్తుందని, ఆయన అభిమానులను ఆకట్టుకుంటుందని వశిష్ట చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




